సమంత. గ్లామర్ విత్ టాలెంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. ఏ మాయ చేశావో అన్న సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సమంతా ఆ తరువాత తెలుగు సినిమానే మాయ చేశారు. ఫ్యాన్స్ ని పెద్ద ఎత్తున కూడగట్టుకున్నారు. సమంతా హీరోయిన్ గా అగ్ర నాయకుల సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆమె అన్ని సినిమాలూ ఒక ఎత్తు రంగస్థలం మూవీ మరో ఎత్తు అని చెప్పాలి.

మూవీ విషయం చెప్పాలంటే సమంత గ్లామర్ తో పాటు టాలెంట్ కూడా పోటీ పడింది. అంత పెద్ద హిట్ కావడం వెనక సమంత పాత్ర కూడా ఉందని చెప్పాలి. ఇక సమంతా చేసిన చాలా సినిమాల్లో  ఆమె పాత్రలే గుర్తుకు వస్తాయి అంటే ఆమె నటనా ప్రతిభ ఏంటో అర్ధమయ్యే ఉంటుంది. ఇక సమంత 2017లో అక్కినేని వారి వారసుడి నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంటుందన్నది తెలిసిందే.

ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అన్న తేడా లేకుండా ఈ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉంటారు. ఇక సమంత పెళ్ళి అయిన తరువాత కూడా వరసగా సినిమాలూ చేసుకుంటూ వెళ్ళారు. దానికి చైతూ కూడా ప్రొసీడ్ అనేశారు. అయితే ఇపుడు సమంత ఒక షాకింగ్ డెసిషన్ ని తీసుకుంది అంటున్నారు. అదేంటి అంటే ఇక మీదట తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ టైమ్ ఇవ్వాలని. అంటే సినిమాలను వదులుకోవాలని.

మొత్తానికి ఫ్యాన్స్ కి చెప్పే చేదు వార్త ఏంటి అంటే సమంత ఇకపైన సినిమాల్లో కనిపించదు. ఆమె ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు తప్ప మరేవీ అంగీకరించడంలేదుట. ఆమె లేటెస్ట్ గా కమిట్ అయిన మూవీ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ష‌న్ లో శాకుంతలం మూవీ. ఈ మూవీ తో పాటు తమిళ్ లో మరో మూవీకి సమంత సైన్ చేసింది అని అంటున్నారు. ఈ మూవీస్ రెండూ పూర్తి చేస్తే ఇక సమంతా నటించడానికి గుడ్ బై కొట్టేస్తుందిట. అదే విధంగా సమంతా ఆఖరి సినిమా తెలుగులో చెప్పాలంటే శాకుంతలమే అంటున్నారు. అదే నిజమైతే బాధాకరమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: