తెలుగు చిత్ర పరిశ్రమలో శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే శృతిహాసన్ హీరోయిన్ కాకముందు మ్యూజిక్ డైరెక్టర్ గా,డాన్సర్ గా పలు ఆల్బమ్స్ చేసి,ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెట్టింది.  మొదట్లో ఈమె నటించిన సినిమాలేవీ పెద్దగా హిట్ కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన తర్వాత ఈమె కెరీర్ మరో మలుపు తీసుకుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఆమె నటించే ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్  హిట్ కావడంతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో  ఉన్న టైంలో విదేశీయుడుతో ప్రేమలో పడి,సినిమా కెరియర్ ని ఆమెను నిర్లక్ష్యం చేసింది.

ఇక దూకుడు మీద ఉన్న శృతి హసన్, అప్పట్లో అనుకోకుండా కొన్ని సినిమాలను రిజెక్ట్  చేసిందట. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా బిజినెస్ మాన్. ఈ మూవీని శృతిహాసన్ కొన్ని కారణాల చేత రిజెక్ట్  చేసిందట.దాంతో కాజల్ ను  ఫైనల్ చేశారు. ప్రభాస్ - రాఘవ లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రెబల్. మొదట హీరోయిన్ గా శృతి హాసన్ ను అనుకున్నారు. అయితే ఏ పాత్రకు అన్నది క్లారిటీ  లేకపోవడంతో శ్రుతిహాసన్ ఈ సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకుంది.

అయితే నాచురల్ స్టార్ నాని - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా జెర్సీ. ఈ మూవీని కూడా శృతి హాసన్ వదులుకుంది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చినప్పటికీ ఆమె చేయడానికి ఒప్పుకోలేదట. దువ్వాడ జగన్నాథం సినిమాకు కూడా మొదట హీరోయిన్ గా శృతి హాసన్ ని అనుకున్నారట. కానీ ఆమె తిరస్కరించడంతో పూజా హెగ్డే ను ఫైనల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: