ఆఖరికి సినిమా డైరెక్టర్ ని కూడా వదలలేదు కేటుగాళ్లు. ఆ డైరెక్టర్ ను బాగా నమ్మించి చివరికి మోసం చేశారు. నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ సినిమా పేరు చెప్పి, ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకు సైబర్‌ నేరగాళ్లు టోకరా వేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. గడిచిన సోమవారం దర్శకుడు వెంకీ సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే ఈ విషయంపై తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వెంకీ. ట్విట్టర్ వేదికపై అసలేం జరిగిందన్న నిజాన్ని పోస్ట్ చేశాడు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నవీన్ అనే పేరుతో ఓ వ్యక్తి నాకు కాల్ చేశాడు. త్వరలో జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ చిత్రాన్ని నామినేట్‌ చేద్దాం అన్నాడు.

అయితే ఆ అర్హత కు తగ్గ సేంద్రియ వ్యవసాయం కాన్సెప్ట్ భీష్మ చిత్రంలో ఉండడంతో.. నేషనల్ అవార్డు కోసం ట్రై చేయడం అతిశయోక్తి కాదు అనిపించింది. దాంతో అప్లై చేయడానికి సిద్ధ పడ్డాను. ఈ క్రమంలో కొన్ని ఫార్మాలిటీస్ కోసం... నవీన్ అనే వ్యక్తి మొదట 63600 రూపాయలు పంపాలని తెలిపాడు. అందుకని ఆయన పంపిన బ్యాంక్ డీటెయిల్స్ కి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. ఆ తర్వాత అతను మళ్లీ కాల్ చేసి ఇంకొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని... ఆ మొత్తం అమౌంట్ తిరిగి రీఫండ్ అవుతుందని  తెలిపాడు. అయినా ఎందుకో నాకు డౌట్ వచ్చి... డీటెయిల్స్ కనుక్కోగా, నేను ఇంతకు ముందు పంపిన డబ్బు ఫిలిం కార్పొరేషన్ ఎకౌంట్ లో పడలేదని తెలిసింది. ఈ పనంతా సైబర్ నేరగాళ్లది అని అర్థమైంది.

ఈ విషయం తెలుసుకుని చాలా మంది లైట్ తీసుకోమన్నారు. డబ్బు పెద్ద మొత్తం కాక పోవచ్చు కానీ నాలా ఇంకెవరు మోస పోకూడదనే  నా ఉద్దేశ్యం. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు 'పొగ త్రాగడం మద్యం సేవించడంతో పాటు అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమే' అని క్యాప్షన్ ఇచ్చారు వెంకీకుడుముల. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని ప్రతి ఒక్కరూ చూసి ముందు ముందు ఇలాంటివి వేరొకరికి జరగకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: