అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి కథానాయికగా లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. శేఖర్ కమ్ముల చివరి చిత్రం ఫిదా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.. మరోవైపు నాగ చైతన్య కు ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే అయన గత చిత్రాలు ఎంతో నిరాశ పరచగా ఈ సినిమా తో మళ్ళీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. దాంతో ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యమైంది..

ఇకపోతే ఈ సినిమా పాటలు యు ట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలుస్తున్నాయి. ఇప్పటికే హే పిల్లా అనే సాంగ్  యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంటుండగా తాజాగా రిలీజ్ అయిన  'దాని పేరే సారంగదరియా..' అనే పాట అంతకు మించి సూపర్ అయ్యింది. ఇందులో సాయి పల్లవి డాన్స్ కి అందరు ఫిదా అవుతున్నారు. ఆమె  ఎక్స్‌ప్రెషన్స్‌ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని సినిమాకోసం ఎదురు చూస్తున్నారు..

ఇక సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా మంగ్లీ ఆల‌పించింది. శశేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య రీతులు స‌మ‌కూర్చిన ఈ  పాట ప్ర‌స్తుతం యూట్యూబ్ ని ఓ ఊపు ఊపేస్తోంది. విడుద‌లైన గంట‌ల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 ప్ల‌స్ మిలియ‌న్ వ్యూస్‌ని క్రాస్ చేసి దూసుకుపోతోంది. త్వ‌ర‌లో మ‌రో మైలు రాయిని దాటి రికార్డు సృష్టించ‌డం ఖాయం అని చెబుతున్నారు. ఓ సున్నిత‌మైన ల‌వ్‌స్టోరీ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ, అమిగోస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ పై నారాయ‌ణ్‌దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు  నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 16న ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: