ప్రస్తుతం ఈ టీవీ లో ఎన్నో రకాల షోలు  బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న డాన్స్ రియాల్టీ షో ఏది అంటే అది ఢీ  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం ఒక ఏడాది నుంచి ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఢీ ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది అన్న విషయం తెలిసిందే.  ప్రతి సీజన్ కూడా అంత కంతకు ఎంతో క్రేజ్ సంపాదించుకుంటు  ఢీ దూసుకుపోతోంది.



 ఈ క్రమంలోనే ఒకప్పుడు కేవలం డాన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది కానీ ప్రస్తుతం డాన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. జబర్దస్త్ లో కామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించే.. సుడిగాలి సుధీర్ హైపర్ ఆది లు  ప్రస్తుతం ఢీ షో లో టీం లీడర్ గా కొనసాగుతుండడంతో.. ఇక వారిద్దరూ కూడా తమదైన శైలిలో కామెడీ పంచుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే .  ఇక ప్రతి వారం కూడా ఢీ షో లో సరికొత్త స్కిట్ తో సుడిగాలి సుధీర్ హైపర్ ఆది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు.



 ఇకపోతే ఇటీవల వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించి ఢీ ప్రోమో విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో  ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అయితే ప్రోమో  లో భాగంగా టీం లీడర్గా ఉన్న సుడిగాలి సుధీర్ హైపర్ ఆది  స్కూల్ పిల్లల లాగా చెడ్డి వేసుకుని వచ్చారు. దీంతో అటు ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవల ఢీ షో లో భాగంగా ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే కాన్సెప్టును చేస్తున్నట్లు ప్రోమోలో  చూస్తే అర్థమవుతుంది.  ఈ క్రమంలోనే స్కూల్ డేస్   గుర్తు చేసుకునే విధంగా సుడిగాలి సుధీర్ హైపర్ ఆది ఏకంగా స్కూల్ యూనిఫారం లో వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక ఎప్పటిలాగే తనదైన శైలిలో కామెడీ పండించారూ .

మరింత సమాచారం తెలుసుకోండి: