లీకుల బారినుండి ‘ఆర్ ఆర్ ఆర్’ ను రక్షించాలని రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈమూవీకి సంబంధించిన స్టిల్స్ లీక్ కాకుండా ఆపే విషయంలో రాజమౌళి సమర్థత సరిపోవడంలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఈసినిమాకు సంబంధించి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు ఒక వీడియో కూడ లీక్ అవ్వడంతో వాటిని సోషల్ మీడియాలో తొలిగించడానికి జక్కన్న చాల పాట్లు పడ్డాడు.


ఇప్పుడు మళ్ళీ ఈసినిమాకు లేటెస్ట్ గా లీకుల బెడద మొదలైంది. పులి తో ఎన్టీఆర్ ఫైట్ చేసిన సీన్ కు సంబంధించిన ఫోటోతో పాటు చరణ్ బ్రిటీషర్ గెటప్ లో ఉన్న ఫోటో అదేవిధంగా ఎన్టీఆర్ ను బ్రిటీష్ ఆర్మీ అధికారులు అరెస్ట్ చేస్తున్న ఫోటో అదేవిధంగా నిప్పుల్లో ఎన్టీఆర్ ఫైట్ కు సంబంధించిన స్టిల్ లీక్ అవ్వడంతో ఈ స్టిల్స్ ను షోషల్ మీడియా నుండి తొలిగించడానికి రాజమౌళి టీమ్ చాల కష్టపడవలసి వచ్చింది అని తెలుస్తోంది.


ఇప్పుడు ఈమూవీ షూటింగ్ దశలో ఉండగా పరిస్థితి ఇలా ఉంటే ఈమూవీ రిలీజ్ కు దగ్గరపడే సమయంలో ఇంకెన్ని లీకులు వస్తాయో తెలియకా రాజమౌళి తల పట్టుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం ఈమూవీకి సంబంధించిన యాక్ష పార్ట్ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పొవెల్ ఆద్వర్యంలో ఈమూవీకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు జక్కన్న చిత్రీకరిస్తున్నాడు. ఈపరిస్థితులు ఇలా ఉండగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఓవర్సీస్ మార్కెట్ కు సంబంధించి కొన్ని ఊహించని సమస్యలు ఎదురౌతున్నట్లు టాక్.


కరోనా పరిస్థితులు తరువాత ఓవర్సీస్ లో సినిమాల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అమెరికాతో పోల్చుకుంటే మన తెలుగు సినిమాలకు మన తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. అయితే టాప్ హీరోల భారీ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ సపోర్ట్ ఉండి తీరాలి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ఒవర్సేస్ ఏరియాల హక్కులు భారీ మొత్తానికి చాల ముందుగానే అమ్మేసారు. అయితే అమెరికాలో ఇప్పటికీ కరోనా కేసులు పెరిగిపోతున్న పరిస్థితులలో అమెరికాలో పరిస్థితులు చక్కబడటానికి చాల సమయం పట్టే ఆస్కారం ఉంది. దీనితో ఈమూవీ ఓవర్సీస్ కు సంబంధించిన బిజినెస్ పై మళ్ళీ బేరసారాలు మొదలయ్యే ఆస్కారం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: