తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షుకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దళపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా భారీ విజయాల్ని అందుకుంటున్నాడు. ఇటీవల మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.

ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగనుందని తెలుస్తుంది. సినిమాకు రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉండనుందట. విజయ్ కెరియర్ లో  65వ సినిమాగా ఈ మూవీ రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన పేరు వినిపించింది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమానుంచి అమ్మడు అవుట్ అయ్యిందని వార్తలు వినిపించాయి. ఇక రష్మిక ప్లేస్ లోకి బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని తెలుస్తుంది. పూజ ఇటు తెలుగు సినిమాలతో అటు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది.

అయితే విజయ్ 65లో హీరోయిన్ పూజ అంటూ త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. దళపతి సినిమాకోసం పూజాహెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో దళపతి సరసన నటించేందుకు పూజ ఏకంగా 3.50 కోట్లు డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. దళపతి 65వ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక అమ్మడికి ఎలాగో ఆ క్రేజ్ ఉంది కాబట్టి  అంత డిమాండ్ చేయడంలో తప్పులేదు అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: