స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో జరిగింది. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ టీం హైదరాబాద్ చేరుకుంది. మరో షెడ్యూల్ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాని ప్యాన్ ఇండియన్ లెవల్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏకకాలంలో ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.. అయితే భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతున్న కారణంగా ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల హక్కులు అమ్మేసే పనిలో ఉన్నారు నిర్మాతలు. 

ఈ నేపథ్యంలో ఓవర్సీస్ రైట్స్ విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఓ డిస్ట్రిబ్యూటర్ ఓవర్సీస్ హక్కులు తనకు కావాలని చెప్పి  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ను అప్రోచ్ అయ్యాడట. ఈ నేపథ్యంలో మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ భారీ షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. పుష్ప ఓవర్సీస్ రైట్స్ కావాలంటే 2.7 మిలియన్ల డాలర్లు చేయాలని మైత్రి మూవీ మేకర్స్ వారు పేర్కొన్నారట. అంటే ఒక వేళ సినిమా కొని రిలీజ్ చేస్తే దాదాపు మూడు మిలియన్ డాలర్లకు పైగా షేర్ రావాల్సి ఉంటుంది.

అలా వస్తేగానీ కొన్న వాళ్లకు లాభం ఉండదు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్ బాగానే ఉన్నా ఓవర్సీస్ లో ఇంకా పూర్తి స్థాయిలో టాలీవుడ్ మార్కెట్ కుదుట పడలేదు. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు అంత భారీ రేట్లు చెప్పడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమాని ఎవరైనా అంత పెట్టి కొంటారా ? లేదా అనేది చూడాలి. ప్రస్తుతం చెబుతున్న రేటుకు అయితే అమ్మకం కావడం అనేది కష్టం అని చెబుతున్నారు ట్రేడ్ వర్గాల వారు. చూడాలి మరి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: