దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజిఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో నటించిన మాళవిక గుర్తు ఉండే ఉంటారు. ఇక కెజిఎఫ్ చాప్టర్ వన్ లో ఆమె దీప హెగ్డే గా కనిపించారు. మాళవిక కేవలం సినిమా నటి మాత్రమే కాదు. ఆమె పలు కన్నడ సీరియల్స్ లో నటించారు. రాజకీయాల్లో కూడా ఆమె తన సత్తా చాటుతున్నారు. కర్ణాటక బీజేపీ ప్రతినిధి గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.

అయితే తెలుగునాట బతుకు జట్కా బండికి రోజా ప్రాతినిధ్యం వహించినట్లే.. ఆమె కన్నడ టెలివిజన్ లో హోస్ట్ గా కూడా వ్యవహరించారు. ఆమె భర్త ఎవరో కాదు. మన చంద్రముఖి సినిమా లో గంగ నుంచి చంద్రముఖి ఆత్మను వెళ్లగొట్టడానికి వచ్చిన సిద్ధాంతి అవినాష్ గుర్తున్నారు. వీరిద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా..? వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇక మాళవిక, అవినాష్ లది ప్రేమ వివాహం. అయితే సినిమాల్లోలాగా వీరిది తొలి చూపులో కలిసిన ప్రేమ కాదు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. దాదాపు నాలుగేళ్ళ స్నేహం వీరి పరిచయాన్ని ప్రేమ గా మార్చింది. ఆ రోజుల్లోనే వీరి రిలేషన్ పై చాలా రూమర్లు వచ్చేవి. అయితే, వాటన్నిటిని దాటుకుని ఓ మంచి రోజు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

అంతేకాక అవినాష్ మైసూర్ విశ్వవిద్యాలయం లో ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆంగ్ల సాహిత్యాభిలాషి అయిన అవినాష్ కొంత కాలం పాటు బెంగుళూరులోని ఎన్‌ఐఇ, మైసూర్, ఎంఇఎస్ కళాశాలలో ఇంగ్లీష్ టీచర్ గా కూడా చేశారు. సినిమాల వైపు ఆసక్తి తో ఇటు వైపు వచ్చిన అవినాష్ దాదాపు రెండువందల సినిమాల్లో నటించారు.

సినిమా రంగంలోకి వచ్చిన తరువాత మాళవిక తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కలిసి సినిమాలకు, ఫంక్షన్ లకు కూడా వెళ్లేవారు. కాలక్రమం లో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి, 2001 లో వివాహబంధం తో ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత కూడా వీరిద్దరూ వీరి అభిరుచి ఉన్న రంగం లోనే కెరీర్ ను కొనసాగిస్తూ సక్సెస్ ఫుల్ గా నిలబడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: