ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన దేవదాసు సినిమతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆ సినిమా తర్వాత మహేష్ కు జోడీగా పోకీరి, మున్నా, జల్ల్సా, రాఖీ వంటి సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోయింది. ఇక తెలుగులో టాప్ హీరోల సరసన నటిస్తూనే బీటౌన్‏లోకి అడుగుపెట్టింది ఈ గోవా బ్యూటీ. అక్కడ కూడా వరుస హిట్ సినిమాలను చేస్తూ.. తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది ఇలియానా. చాలా కాలం తర్వాత మాస్ మాహారాజా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మళ్లీ టాలీవుడ్‏కు అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. అభిమానులకు అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఇటీవలే తన కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ చెప్పుకోచ్చింది ఈ బ్యూటీ.
తాజాగా ఇలియానా షేర్ చేసిన నెట్టింట్లో వైరల్ గా మారింది. గతంలో కాస్తా లావుగా మారిన ఇలియానా ఇటీవల వర్క్ అవుట్స్ చేస్తూ బరువు తగ్గుతూ వస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పుటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఇక ప్రస్తుతం ఇలియాన షేర్ చేసిన ఫోటో చూస్తుంటే ఈమె అసలు ఇలియానేనా ? అనే సందేహం కలిగేలా కనిపిస్తుంది. వర్క్ అవుట్ చేస్తూ.. మళ్లీ నాజుగ్గా మారీ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది. ఇక ఇలియానా షేర్ చేసిన ఫోటోతో మీమ్స్ రాయుళ్ళు తెగ రెచ్చిపోతున్నారు. బాగా బక్కిచిక్కిపోయి.. ముఖంలో కూడా ఎలాంటి కళ లేకుండా.. అసలు ఇలియానాకు ఏమైంది అనుకునేంతలా మారి పోయి అందిరికి షాక్ ఇస్తుంది ఈ గోవా బ్యూటీ.. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ''అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, ది బిగ్‌ బుల్‌'' అనే హిందీ సినిమాలతో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: