నందమూరి బాలక్రిష్ణ ఆరు పదుల వయసులో కూడా అదరగొడుతున్నాడు. బాలయ్యకు గత నాలుగేళ్ళుగా సరైన హిట్ లేదు. రూలర్ సినిమాతో మార్కెట్ కూడా కంప్లీట్ గా డల్ అయింది. అయినా సరే బాలయ్య ఓకే చెప్పాలే కానీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఎంతో మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా బాలయ్య కోసం క్యూ కడుతున్నారు. దటీజ్ బాలయ్య అనిపిస్తున్నారు.

ఇక బాలయ్య బోయపాటితో కలసి ఇపుడు హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. వచ్చే నెలతో ఈ మూవీ పూర్తి అవుతుంది. మే నెల 28న ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తారు. అదే మే నెలలో బాలయ్య క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో కొత్త సినిమాను మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తునారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి టార్గెట్ చేశారు.

మూవీ తరువాత బాలయ్య చేయబోయే మూవీ ఏంటి అన్నది కూడా డిసైడ్ అయింది అంటున్నారు. ఈ మూవీ ఒక సూపర్ కాంబోతో రెడీ అవుతోందిట. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు అంటున్నారు. ఈ మూవీని యంగ్ టాలెంటెడ్ సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తాడు అంటున్నారు.

అప్పట్లో రామారావు పేరు మీద బాలయ్యకు అనిల్ ఒక కధ వినిపించాడు అని టాక్ వచ్చింది. ఇపుడు ఆ కధనే కొన్ని మార్పులు చేసి అనిల్ రావిపూడి బాలయ్యతో తీస్తారని టాక్. ఈ మూవీ బాలయ్యతో వచ్చే ఏడాది ఉండవచ్చు అంటున్నారు. మొత్తానికి బాలయ్య చేతిలో వరసపెట్టి టాప్ బ్యానర్లు, టాప్ డైరెక్టర్లతోనే మూవీస్ ఉన్నాయని అంటున్నారు. సో బీబీ త్రీ హిట్ అవాలి కానీ మళ్ళీ మరో అయిదేళ్ల పాటు బాలయ్య వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: