ప్రియ ప్రకాష్ వారియర్  రెండు సంవత్సరాలు క్రితం ఓరు ఆడార్ లవ్ టీజర్ తో ఇండియా అంత ఒక ఊపు ఉపేసింది. ఈ సినిమాలో తాను మెయిన్ హీరోయిన్ కాకపోయినా ఈ సినిమాతో మాత్రం ప్రియ ప్రకాష్ మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది.  ఓరు ఆడార్ లవ్ సినిమాని తెలుగు లోకి కూడా లవర్స్ డే గా డబ్బింగ్ చేశారు . ఈ సినిమా రిలీస్ కి ముందు చాలా హైప్ వచ్చిన ఒక్కసారి రిలీస్ ఐయ్యాక మాత్రం గోరా పరాజయం అందుకుంది. తెలుగులోనే కాదు మలయాళం లో కూడా ఇదే పరిస్థితి. ఈ సినిమా టీజర్ చూసి అందరూ ప్రియ ప్రకాష్ కి చాలా ఛాన్స్ లు వస్తాయి అని అందరూ అనుకుంటే దానికి తలకిందులు గా తనకి సినిమా తర్వాత అనుకున్నంత రేంజ్ లో మాత్రం ఛాన్సులు రాలేదు. ఇలా కెరీర్ చాలా డల్ గా నడుస్తున్న ప్రియ ప్రకాష్ వారియర్ కి  తెలుగులో చంద్ర శేఖర్ యేలేటి , నితిన్ కాంబినేషన్ లో వచ్చిన చెక్ సినిమా చేసే అవకాశం వచ్చింది.  ఈ సినిమా తో అయిన తెలుగులో అవకాశాలు వస్తాయి అని ఈ భామ ఆశ పడింది.  ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ ప్రియ ప్రకాష్ వారియర్ కి వరసగా అవకాశాలు వస్తున్నాయి. చెక్ సినిమా తర్వాత ఆమె చేస్తున్న చిత్రం ఇష్క్ నాట్ ఏ లవ్ స్టొరీ . మలయాళంలో వచ్చిన ఇష్క్ సినిమాని తెలుగులోకి అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మీరు ప్రేమకథలు చూసి బోర్ అయిపోయారా అయితే ఇష్క్ సినిమా మీకు నచ్చతుంది అని మూవీ టీం అంటున్నారు. ఈ సినిమాతో  అన్న ప్రియ ప్రకాష్ కి హిట్ వస్తుందేమో చూడాలి. ఈ సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ కి జోడిగా తేజ సజ్జ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: