పూజ హెగ్డే తెలుగు, హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రభాస్‌తో పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధే శ్యామ్‌  అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తున్నారు. చేస్తోంది. వీటితోపాటు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ ఈ బుట్టబొమ్మ తళుకున్న మెరవనున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించనుండగా..ఆయన తనయుడు రామ్‌ చరణ్‌కు జోడీగా పూజా నటించనుంది. ఇలా రెండు భాషల్లో చేతినిండా ప్రాజెక్టులు చేస్తోన్న పూజ ఈ మధ్య తన రెమ్యూనరేషన్ కూడా విపరితంగా పెంచేసింది అని టాక్. ప్రస్తుతం పూజ దాదాపుగా 3.5 కోట్లు తీసుకుంటుందట. ఆమె త్వరలోనే చేయబోయే తమిళ సూపర్ స్టార్ విజయ్ 65 వ చిత్రంలో పూజ కి 3.5 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు అని టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయంలో ఇంకా ఆఫీషల్ గా ఏది బైటకు రాలేదు. ఇక దళపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా భారీ విజయాల్ని అందుకుంటున్నాడు. ఇటీవల మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగనుందని తెలుస్తుంది. సినిమాకు రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉండనుందట. ఇక ఈ సినిమాలో రష్మిక ప్లేస్ లోకి బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని తెలుస్తుంది. పూజ ఇటు తెలుగు సినిమాలతో అటు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: