ఈరోజు అనగా మార్చి 5 2021 శుక్రవారం నాడు విడుదలైన చిత్రాలు ఏ నేపథ్యంలో విడుదల అయ్యాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 .ఏ వన్ ఎక్స్ప్రెస్:
మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ, ఇప్పటి వరకూ ఏ ఒక్కరు ఈ క్రీడా అంశంపై ఒక సినిమా కూడా తీయలేదు. కానీ ఇప్పుడు సరికొత్తగా హాకీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతోన్న మొదటి చిత్రం ఏ వన్ ఎక్స్ప్రెస్. ఈ చిత్రంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డెన్నీస్‌ జీవన్‌ కనుకొలను ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

2.  పవర్ ప్లే:
డ్రగ్స్ తో పాటు రాజకీయాల  నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తుండగా, మహీధర్, దేవేష్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు.

3. ప్లే బ్యాక్ :
క్రాస్ టైం కనెక్షన్ అనే సరికొత్త పాయింట్‌తో టైం కి సంబంధించిన నేపథ్యంలో  సైన్స్  ఫిక్షన్  థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ చిత్రంలో హుషారు ఫేమ్ దినేష్ తేజ్, అనన్య నాగల్లా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు హరి ప్రసాద్ జక్కా దర్శకత్వం వహించారు.


4. షాదీ ముబారక్ :
 పెళ్లిచూపులు నేపథ్యంలో కొనసాగే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని ట్రైలర్ చూసిన వారు అంటున్నారు. మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్ ఈ సినిమా తో హీరోగా తెరకెక్కుతుండగా, దృష్ట్యా రఘునాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. పద్మశ్రీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక దిల్ రాజు ఈ సినిమాతో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

5.  క్లైమాక్స్:
సరదా కోసం ఎడారి కి వెళ్ళిన వారు, గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఆ కష్టాలు ఎందుకు వచ్చాయో..? అలాగే పూర్తి రొమాన్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వర్మ  దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో స్టార్లింగ్ మియా మాల్కోవా పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అని చెప్పవచ్చు..

6. దేవినేని:
బెజవాడ నేపథ్యంలో ప్రముఖ రాజకీయవేత్త దేవినేని  నెహ్రూ జీవిత  ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి, నిర్మాతలు జిఎస్ఆర్, రాము రాథోడ్‌.. అలాగే దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు). ఈ సినిమాలో నందమూరి తారక రామారావు హీరోగా నటిస్తున్నాడు..

7. రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ :
ఇంగ్లీష్ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తూ, విడుదలవుతున్న ఈ చిత్రం పిల్లలను బాగా ఆకట్టుకుంటుందని సమాచారం.డాన్ హాల్,కార్లోస్ లోపెజ్ ఎస్ట్రాడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఓస్నాట్ షురర్, పీటర్ డెల్ వెకో లు నిర్మాతగా వ్యవహరించారు.

8. సీత ఆన్ ది రోడ్ :
సీత ఆన్ ది రోడ్ మహిళా సెంట్రిక్ చిత్రం.. ఈ చిత్రానికి ప్రణీత్ యారోన్ దర్శకత్వం వహించగా, ప్రనూప్ జవహర్ తో పాటు ప్రియాంక తాతి లు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: