ఉప్పెన సినిమాతో అదిరిపోయే డెబ్యూ హిట్ అందుకుంది హీరోయిన్ కృతి శెట్టి.. కేవలం ఈమె మాత్రమే కాదు.. ఈ సినిమా హీరో, దర్శకుడు కూడా తమ డెబ్యూ హిట్ అందుకున్నారు.. కానీ మనం ఇక్కడ మాట్లాడాల్సిన అంశం ఉప్పెన బ్యూటీ గురించే.. ఈ అమ్మడు ఒక్క సినిమాతో బాగా ముదిరిపోయిందట.. ఇంతకీ విషయం ఏంటంటే.."  ఈ క్యూట్ బ్యూటీ తాజాగా ఓ టారీఫ్‌ని విడుదల చేసిందట. అంటే హీరోయిన్‌గా అయితే ఇంత.. సెకండ్ హీరోయిన్‌గా అయితే ఇంత, ఐటమ్ సాంగ్ అయితే ఇంత అని..డైరెక్ట్‌గా ఓ రెమ్యూనరేషన్ టారీఫ్‌ని విడుదల చేసిందట. దీంతో బేబమ్మ బాగా ముదిరిపోయిందని దర్శకనిర్మాతలు ఆమెను ఉద్ధేశించి అనుకుంటుండటం విశేషం.

ఇటీవల ఓ నిర్మాత తన సినిమాలో నటించమని.. వెళితే.. అక్షరాలా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అయితేనే చేస్తానని చెప్పిందట. అంతే కాదు.. కారవ్యాన్, కాస్ట్యూమ్స్, ఫుడ్, అసిస్టెంట్స్‌కి అయ్యే ఖర్చు ఎక్స్‌ట్రా అని చెప్పిందట. అంతే ఒక్కసారిగా ఆ నిర్మాత అక్కడి నుంచి పారిపోయాడంటే నమ్మాలి మరి. ఆమె 'ఉప్పెన' చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 6 లక్షలు. ఆ తర్వాత సినిమాలకు రూ. 60 లక్షల రెమ్యునరేషన్ అనేలా వార్తలు వచ్చాయి. అంటే 10 రెట్లు పెంచేసింది. అయినా సరే ఫ్రెష్ ఫేస్ కదా.. అని నిర్మాతలు రూ. 60 లక్షలకు కూడా ఓకే అయ్యారు.

 కానీ ఇప్పుడు రూ. కోటి ప్లస్ ఎక్స్‌ట్రా ఖర్చులంటూ.. ఓ స్టార్ హీరోయిన్‌ అడిగినంత అడిగే సరికి.. ఆమెకో నమస్కారం పెట్టి.. నిర్మాత వెనక్కి వచ్చేశాడంట. బేబమ్మ.. బేబమ్మ అని అంతా నెత్తికి ఎక్కించుకున్నారని ఫీలైపోతుందో.. లేక ఉన్న అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుందో తెలియదు కానీ.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అక్షరాలా ఆమె పాటిస్తుంది.  ఆమె అడిగే రెమ్యునరేషన్‌కి అలాంటి హీరోయిన్స్‌ని ఇద్దర్ని తీసుకొచ్చుకునే సామర్థ్యం ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని.. కేవలం ఒక్క సినిమాతోనే ఇంతలా డిమాండ్ చేయడం సరి కాదని అంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: