టాలీవుడ్ లో నెపోటిజం గురించి ఎక్కువగా చర్చ జరగకపోయినా టైం వచ్చినప్పుడు అది కూడా ఓ ఉద్యమం లా తయారవుతుందని గతంలో జరిగిన అనుభవాలను బట్టి చెప్పొచ్చు.. బాలీవుడ్ లో ఇప్పుడు ఇదో పెద్ద ఉద్యమం లా జరుగుతుంది.. వారసుల తనయుల చిత్రాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు బాలీవుడ్ జనాలు.. ఇప్పుడు తెరకెక్కబోతున్న సినిమాలు కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి.. అయితే అప్పటివరకు ఈ ఉద్యమం ఎలా ఉండబోతుందనేది చూడాలి..  ఇక టాలీవుడ్ విషయానికొస్తే ఎక్కువమంది హీరోలు ఏ ఫ్యామిలీ నుంచి ఉన్నారంటే మెగా అనే చెప్తారు.

చిరంజీవి తర్వాత అయన పేరు చెప్పుకుని ఓ డజను మంది హీరోలు పుట్టుకొచ్చారు.. అంతేకాదు వీరిని చూసి ఇతర ఫ్యామిలి నుంచి కూడా హీరోలు దిగారు.. ఏ పెద్ద సినిమా చేసిన ఈ నాలుగు ఫ్యామిలీ హీరోలు తప్పా ఎవరు కనిపించరు..ఎప్పుడో విజయ్ దేవరకొండ లాంటి హీరో పుట్టుకొస్తారు.. అంతేకానీ మాక్స్ ఈ నాలుగు ఫ్యామిలీ హీరోలే ఎక్కువగా కనిపిస్తుంటారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..మెగాస్టార్ చిరంజీవి నుంచి నిన్న ‘ఉప్పెన’తో వచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు దాదాపు 10కి పైగానే హీరోలు మెగా ఫ్యామిలీలో ఉన్నారు. ఇప్పుడు మరో హీరో ఈ ఫ్యామిలీకి యాడ్ కాబోతోన్నారు.  అయితే ఈసారి ఎంట్రీ ఇచ్చేది మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి కాదు.. ఆయన బావమరిది అల్లు అరవింద్ ఫ్యామిలీకి చెందిన రిలేషన్ నుంచి ఓ హీరో ఈ ఫ్యామిలీకి యాడ్ కాబోతున్నాడు.

ఇంతకీ ఎవరా హీరో అంటే అల్లు అరవింద్ బావమరిది కొడుకు ముత్తంశెట్టి విరాన్.. ఇప్పుడు ‘బతుకు బస్టాండ్’ అంటూ తన బతుకేంటో తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. విరాన్ ముత్తంశెట్టి హీరోగా ‘బతుకు బస్టాండ్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంతకు ముందెప్పుడో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా అప్‌డేట్‌ని టైటిల్‌తో సహా చిత్రయూనిట్ ప్రకటించింది. త్వరలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: