పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేయాలనీ ఏ హీరోయిన్ కి ఉండదు చెప్పండి. ఆయనతో ఒక్క సినిమా చేస్తే పది సినిమాలు చేసిన క్రేజ్ వస్తుంది. అందుకే ఆయనతో సినిమా చేయాలనీ హీరోయిన్ లు పోటీ పడుతుంటారు.. సాధారణ నటీమణులు కూడా పవన్ తో ఫోటో దిగాలని ఎగబడిపోతుంటారు. ఇక అభిమానుల సంగతి సరే సరి.. పవన్ ను వారు ఓ దేవుడిలా చూస్తుంటారు. ఆరాధ్యంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ నాలుగు సినిమాలను లైన్ లో ఉంచాడు..

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉండగా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలోని ఏకే రీమేక్ సినిమా షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తో పాటే క్రిష్ దర్శకత్వంలోని విరూపాక్ష సినిమా లోనూ నటిస్తున్నాడు పవన్.. మరోవైపు పవన్ రాకకోసం హరీష్ శంకర్ ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉన్న పవన్ కి హీరోయిన్ సమస్య వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా..నిజమే.. పవన్ సినిమాకి హీరోయిన్ ల సమస్య ఎదురవుతుంది.

ఏకే రీమేక్ లో పవన్ సరసన సాయిపల్లవి నటించాల్సి ఉండగా.. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాలేకనో మరి ఏ విధంగానో సినిమా నుండి తప్పుకుందని టాక్ వచ్చింది. మొత్తానికి సాయిపల్లవి ఈ సినిమాలో లేదని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇంతలో మరో వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో రానా భార్యగా ఐశ్వర్యరాజేష్ కనిపించనుందని తెలిసిందే. ఆమె పేరు అధికారికంగా కూడా ప్రకటించారు మేకర్స్. కానీ తాజాగా ఐశ్వర్య కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏమైయ్యుంటుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఐశ్వర్య కూడా డేట్స్ ఖాళీ లేకనే ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.ఐశ్వర్య ప్రస్తుతం అయితే తెలుగు తమిళ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలు కలిగి ఉందట. మరి వీరి ప్లేస్ లో ఎవరు వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: