టాలీవడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత భారీ వ్యయంతో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సినిమా రౌద్రం రణం రుధిరం. తొలిసారిగా యంగ్ టైగర్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా కీరవాణి సంగీతాన్ని వి. విజయేంద్రప్రసాద్ కథని సమకూరుస్తున్నారు. స్వాతంత్రోద్యమానికి ముందు జరిగిన కథగా కొంత ఫిక్షనల్ అంశాలు జోడించి ఎంతో గ్రాండ్ లెవెల్లో దర్శకుడు ఈ రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాని ఎంతో భారీగా ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తుండగా ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అలానే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల యొక్క ఫస్ట్ లుక్ టీజర్స్ అందరి నుండి సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఈ మూవీ పై మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ యొక్క యుఎస్ఏ రైట్స్ కి సంబంధించి ప్రస్తుతం కొంత వివాదం జరుగుతోందని, కరోనాకు ముందు భారీ ధరకు ఈ మూవీ రైట్స్ కొంత అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న ఒక డిస్ట్రిబ్యూటర్, అక్కడ మరికొన్నాళ్ల వరకు సరైన పరిస్థితులు ఏర్పడేలా లేవని, దీనిని బట్టి చూస్తుంటే ఆర్ఆర్ఆర్ అక్కడ పెద్దగా కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ లేదనే ఉద్దేశ్యంతో గతంలో చెప్పిన ధర కంటే తక్కువ ధరకు సినిమా రైట్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు టాక్. అయితే ఈ విషయమై ఆర్ఆర్ఆర్ యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉందని, మరి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అమెరికా లో పరిస్థితులు చక్కబడే వరకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయరేమో అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తుండగా, ఇది సినిమాకి కొంత చిక్కు సమస్యగా మారనుందని అంటున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలంటే స్వయంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పందించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: