మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న సినిమా ఆచార్య‌. ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాలో మెగాస్టార్ స‌ర‌స‌న హీరోయిన్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సినిమాలో చిరు, చ‌ర‌ణ్ ల గురు శిష్యులుగా క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇది వ‌ర‌కే రామ్ చ‌ర‌ణ్ మెగాస్టార్ లు క‌లిసి తెర పై క‌నిపించిన ఆ అది కొద్ది నిమిషాల‌కే ప‌రిమిత‌మైంది. అయితే ఆచార్య సినిమాలో మాత్రం చ‌ర‌ణ్ ఓ ఫుల్ లెన్త్ క్యారెక్ట‌ర్ ను చేస్తున్నారు. దాదాపు చ‌ర‌ణ్ పాత్ర సినిమాలో 30 నిమిషాల వ‌ర‌కు ఉంటంద‌ని కొర‌టాల ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక ప్ర‌‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై రాంచ‌ర‌ణ్‌-నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఇటీవ‌లే తూర్పు గోదావ‌రి జిల్లాలోని మారేడ్ మిల్లి అడ‌వుల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే అయితే తాజాగా సినిమాలో త‌న 20రోజుల షూటింగ్  షెడ్యూల్ ను రామ్ చ‌ర‌ణ్ పూర్తి చేసుకున్నారు.

అయితే ఈ షూటింగ్ ను వీక్షించేందుకు రాంచ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా మారేడ్ మిల్లికి వెళ్లింది. అక్క‌డ రామ్ చ‌ర‌ణ్ పూజా హెగ్డే మ‌ధ్య ఒక పాట‌ను చిత్రించారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ , ఉపాస‌న ఎయిర్ పోర్ట్ కు చేరుకోవ‌డంతో అక్క‌డ‌కు భారీగా చ‌ర‌ణ్ అభిమానులు చేరుకుని సెండాఫ్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ సిధ్ధ అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు చిత్ర యూనిట్  ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అంతే కాకుండా రామ్ చ‌ర్‌ణ్ కు సంబంధించిన ప్రీలుక్ తో పాటు మ‌రో ఫోటో‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ప్రీలుక్ లో చ‌ర‌ణ్ లుక్ ఎంత‌గానో అక‌ట్టుకుంది. ఇదిలా ఉండగా చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆచార్య తో పాటు ద‌ర్శ‌క‌దీరడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీర్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తుండ‌గా..రామ్ చ‌రణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే పూర్తికానుంది. ఇక ఆ వెంట‌నే చ‌ర‌ణ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అనుకున్న సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: