ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమ లో బ్యూటీ క్వీన్  కియారా అద్వాని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా  పేరు సంపాదించింది.  ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోనే కాదు అన్ని  ఇండస్ట్రీలలో  కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూనే మరోవైపు.. గ్లామర్ పాత్రలో నటించి అందరిని ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే.


 అంతే కాకుండా ఎప్పుడు గ్లామర్ పాత్రల్లో అందరిని ఆకర్షించడం లో కియారా అద్వానీ దిట్ట  అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా కియారా అద్వానీ ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులందరి మతి పోగొడుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమ లో కియారా అద్వానీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ గా  గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ.



 అయితే ఇప్పటి  వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అసలు పేరు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు తెలియదు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. కొంత మందికి మాత్రమే కియారా అద్వానీ అసలు పేరు ఏంటి అన్నది తెలుసు. అయితే ఇటీవలే కియరా అసలు  పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే కియారా  అద్వాని అసలు పేరు తెలియని అభిమానులు అందరూ ఈ కొత్త పేరు తెలిసి..  షాక్ అవుతున్నారు. ఇంతకీ కియారా అద్వానీ అసలు పేరు ఏమిటి అని అంటారా.. ఆలియా అద్వాని. ఆలియా అద్వానీ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమా లోకి రాగానే కియారా అద్వాని గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: