తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాంకర్స్‌లో నెంబర్ వన్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా సుమ కనకాల పేరు వస్తుంది. అయితే ఫీమేల్ యాంకర్స్ కాకుండా మేల్‌లో అయితే ఎవరు అంటే ప్రదీప్ మాచిరాజు అంటారు. ఈయనతో పాటు చాలా మంది ఉన్నారు కానీ మేల్ యాంకర్స్‌లో అగ్రపీఠం మాత్రం ఈయనదే. దానికి తగ్గట్లుగానే ప్రదీప్ సంపాదన కూడా ఉందని అర్థమవుతుంది. 30 రోజులు బిజీగానే ఉంటాడు ఈ యాంకర్. ఈ మధ్యే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు.


30 రోజులలో ప్రేమించడం ఎలా? ఈ టైటిల్ చూడగానే సినీప్రేక్షకులంతా ఆకర్షితులు అయ్యారు. పైగా ప్రదీప్ లాంటి మంచి కామెడీ టైమింగ్ వున్న యాంకర్ హీరో కావడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఇంతలో ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ సాంగ్స్ రిలీజ్ చేసి చిత్రంపై మరింత ఆసక్తి నెలకొల్పేలా చేసారు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అనే పాట యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి .ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.ఇది ఇలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ తన మొదటి ప్రేయసి ఎవరో చెప్పి ఆశ్చర్యపరిచారు.మొదటి గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరు? ఫస్ట్ లవ్ మ్యాటర్ గురించి చెప్పండి అనగానే సోనాలి బింద్రే అని చెప్పేసాడు ప్రదీప్.


సినిమా తారల గురించి కాదు మీ నిజ జీవితంలో మీ మొదటి గర్ల్‌ఫ్రెండ్‌ పేరు చెప్పు అని ఇబ్బంది పెట్టాడు యాంకర్. అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు ప్రదీప్.తనకు ఆమె పేరు చెప్పి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని ఎందుకంటే ఇప్పుడు తాను తన భర్త పిల్లలతో కలిసి ఈ షో చూస్తూ వుండచ్చని సమాధానమిచ్చాడు ప్రదీప్.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రదీప్ చెప్పిన ఈ ప్రేమకథ జనాలలో ఆసక్తి రేకెత్తిస్తుంది.



ఇదే విదంగా తన పెళ్లి గురించి స్పందించిన ప్రదీప్ ప్రేమ వివాహం చేసుకోనని.ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటానని . కానీ దానికి పెళ్లి చూపులు లాంటి హడావిడీలు ఏమి ఉండవు అని చెప్పారు.మాథమెటిక్స్ లెక్చరర్ గా పని చేసి డైరెక్టర్ అయిన సుకుమార్ దగ్గర దర్శకత్వమే కాదు.ఆదిత్య కాలేజీలో లెక్కలు కూడా నేర్చుకున్న విద్యార్థి ఇప్పుడు ౩౦ రోజులలో ప్రేమించడం ఎలా ? దర్శకుడు మున్నా. సుకుమార్ దగ్గర నేనొక్కడినే ఆర్య 2 చిత్రాలకు సహాయ దర్శుకుడిగా పనిచేసారు.చిత్రంలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది . ఈ చిత్ర నిర్మాత బాబు బడ్జెట్ విషయంలో ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ చిత్ర బృందానికి సినిమా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాము.

మరింత సమాచారం తెలుసుకోండి: