త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఆ తర్వతా నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్‌లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది.

 ఒక్కో సినిమా కథ అనుకోగానే కాస్టింగ్ కూడా త్వరగా కుదిరిపోతుంటారు. షూటింగ్ కూడా చకచకా జరిగిపోతుంది. అన్ని అలా కలిసి వచ్చేస్తుంటాయి. కొన్ని సినిమాలకు మాత్రం మొదలు పెట్టిన దగ్గరనుండి ఏదో ఒక అంశం అడ్డుపడుతుంది. అది కాస్టింగ్ రూపంలోనో, టైటిల్ రూపంలోనో మరింకేదో. చిరంజీవి ఆచార్య సినిమా పరిస్థితి ప్రస్తుతం అలానే ఉంది. సైరా ఊహించని దెబ్బ కొట్టడంతో ఆచార్యపైనే ఆశలు పెట్టుకున్నారు. కాని ఈ సినిమా మాత్రం మొదటి నుండి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది .ఇప్పుడేమైందంటే.“ఆచార్య” కన్ఫామ్డ్ టైటిల్.అయితే యంగ్ చిరూ పాత్రకి బన్ని, చరణ్,మహేశ్ బాబు ఈ ముగ్గురిలో  ఎవరిని తీసుకోవాలా అని తర్జన భర్జనలు పడ్డారు. బన్ని ని తీస్కుందాం అని చిరు అంటే, మహేశ్ ని కొరటాల శివ ప్రపోజ్ చేశాడు. బన్ని,చరణ్ లు ఆయా షూటింగ్లతో బిజిగా ఉండడంతో,మహేశ్ ని ఫైనల్ చేశారు.



 ఇప్పుడు ఇదే సినిమాకి మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది.ముసలి హీరోలతో నటించను అని ఒకప్పుడు త్రిష తనకు తాను పెట్టుకున్న రూల్ ని బ్రేక్ చేసుకుని, ఎవరితో అయినా నటించడానికి సిధ్దమే అని గతంలో స్టాలిన్లో చిరుతో, పేటాలో రజినితో నటించింది. ఇప్పుడు మళ్లీ చిరుతో ఆచార్యలో నటించడానికి ఒప్పుకుంది. ఇప్పటికే  షూటింగ్ స్టార్ట్ కూడా అయింది.కాని త్రిషకి మళ్లీ ఒక చిక్కొచ్చిపడింది. అది మహేశ్ రూపంలో మహేశ్ బాబు , త్రిష గతంలో అతడు, సైనికుడు రెండు సినిమాల్లో కలిసి నటించారు.అతడు సూపర్ డూపర్ హిట్. వీళ్లిద్దరి కాంభినేషన్ కూడా హిట్టే. ఇప్పుడు చిరు సరసన త్రిష నటిస్తే, మహేశ్ సరసన నటించడానికి ఒక యంగ్ హీరోయిన్ ని తీసుకుంటారు. దాంతో త్రిష సీనియర్ కేటగిరిలోకి చేరిపోతానని భయపడుతుందట .అంటే ఇక యంగ్ హీరోలతో నటించడానికి, తన కెరీర్ కి తనకు తానే చెక్ పెట్టుకున్నట్టు అవుతుందనే భావనతో ఈ సినిమానుండి తప్పుకుంటున్నట్టు చెప్పేసిందట. తన యాంగిల్లో ఆలోచిస్తే  త్రిష బాధలోనూ అర్దం ఉంది అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: