పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన నేనింతే దానిని అధిగమించింది.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి.


తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోయే దర్శకులలో ఒకరు పూరి జగన్నాధ్ . ఈయన పేరు వింటేనే మాస్ డైలాగ్స్ , హై ఎమోషనల్ పంచ్ లు ,వెరైటీ హీరో పాత్రలు , డిఫరెంట్ లవ్ స్టోరీస్ గుర్తుకు వస్తాయి . తన మొదటి సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తోనే తన తాలూకు ప్రేమకథలు ఎలా ఉంటాయో పరిచయం చేసారు పూరి . తర్వాత ఇడియట్, ఒక చంటి గాడి ప్రేమ కదా అంటూ రవితేజతో తీసిన సినిమాలో చూడగానే హీరోలవ్ యు చెప్పే సన్నివేశం ఉంటుంది . దానికి హీరోయిన్ చూడగానే లవ్ ఆ అని అడగ్గానే పోనీ రేపు చెప్పనా లేకపోతె ఎల్లుండా చెప్పనా ఎప్పుడు చెప్పిన ఒక్కటే ఇక్కడ ఏముందో అదే బయటకి వస్తుంది అని హీరో పాత్రతో చెప్పిస్తారు.


ఇలా తిక్క తిక్కగా ఉండే హీరో పాత్రలు అంతే హృదయాన్ని హత్తుకొనే ప్రేమకథలు తెరకెక్కించడం లో పూరి మాస్టర్ అనే చెప్పాలి . చాలాసార్లు సినిమాల్లో చూపించిన కొన్ని సన్నివేశాలు నాకు కూడా ఇలానే జరిగిందే అన్నంత రియాలిటీ గా ఉంటాయి.కొన్నిసార్లు ఇది నా కథ అని కూడా అనుకుంటూ ఉంటాం . అయితే మన టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రేమ కథలో కూడా సినిమా కి మించిన హై ఎమోషన్ ఉంది. డిఫరెంట్ లవ్ స్టోరీస్ ను తెరకెక్కించే ఈ దర్శకుడు ప్రేమకథ కూడా అంతకంటే డిఫరెంట్ గా ఉంటుంది.పూరి ప్రేమకథను బాగా పరిశీలిస్తే అయన కధలకు ప్రేరణ అని కూడా అనిపిస్తుంది .పూరి జగన్నాధ్ తన భార్య లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కాగా ఈ ప్రేమ విహహం గురించి చాలా మందికి తెలిసిన , అసలు ఈ ప్రేమ వివాహం ఎలా అయింది అనేది చాలా మందికి తెలియదు .పూరి లవ్ మ్యారేజ్ వెనకాల ఓ పెద్ద కథే ఉంది .


వెండితెర దర్శకుడిగా ప్రయత్నిస్తున్న రోజులవి . కాగా అవకాశాలు రాక దూరదర్శన్ లో ఓ సీరియల్ లో పనిచేస్తూ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లోని రమంతపూర్ వెళ్లారు . అక్కడ లావణ్యను చూసి మొదటి చూపులోనే ప్రేమించేశాడట. తన ప్రేమను ఆమెకు ఎలా చెప్పాలో తెలియని పూరి అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిసి, ‘ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఇది నా విజిటింగ్ కార్డు ఇందులో ఫోన్ నంబర్ కూడా ఉంది నచ్చితే కాల్ చేయమని చెప్పు అని కార్డు ఆ అమ్మాయికి ఇచ్చి పూరి వెళ్లిపోయారు. చూడగానే ప్రేమ అంటే ఏ అమ్మాయి మాత్రం నమ్ముతుంది.సరిగ్గా లావణ్య కూడా అలానే అనుకుంది అంట కానీ పూరి మాత్రం పట్టువదలుకుండా లావణ్య ఎక్కడ ఉంటుందో తెలుసుకొని వెనకాలే తిరిగి తన ప్రేమలో సక్సెస్ అయ్యాడు . అయితే వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించక పోవడంతో ,పెద్దలకు తెలియకుండా స్నేహితుల సమక్షంలో 2000 లో వివాహం చేసుకున్నారు.వీరికి ఆకాష్, పవిత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆకాష్ ఇప్పటికే తెలుగుతెరకు హీరో గా పరిచయం కాగా పవిత్ర మాత్రం తండ్రి బాటలోనే దర్శకత్వం చేపట్టే యోచనలో ఉంది . సో పూరి సినిమాలను చుస్తే తన ప్రేమకథ నుండి ప్రేరణ పొందారు అనిపిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: