విజయ్ సేతుపతి ప్రస్తుతం అన్నీ సినీ ఇండస్ట్రీ లలో బాగా వినిపిస్తున్న పేరు. చిన్న చిన్న పాత్రల నుండి ప్రస్తుతం స్టార్ హీరోగా తమిళ్ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు. తన నటన తోనూ, ఎన్నో వైవిధ్యమైన పాత్రలతోనూ, అశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎటువంటి పాత్రనైనా తనదైన నటనతో అలరించే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. అందుకే అభిమానులు " మక్కల్ సెల్వన్ " గా పిలుచుకుంటారు.

అయితే విజయ్ సేతుపతికి ఇంతటి స్టార్ డమ్ ఉన్నప్పటికి కేవలం హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, విలన్ గాను,నటిస్తూ మెప్పిస్తున్నాడు. కథలో తన పాత్ర నచ్చితే చిన్నదైన, పెద్దదైన నటిస్తూ పాత్ర కు పూర్తి స్థాయి న్యాయం చేస్తాడు విజయ్ సేతుపతి. ఈ హీరో కేవలం తమిళ్ వరకే పరిమితం కాకుండా తెలుగులోను సత్తా చాటుతున్నాడు. గతం లో చిరంజీవి నటించిన " సైరా నరసింహారెడ్డి " సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన "ఉప్పెన" సినిమాలో విలన్ గా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో విజయ్ 'రాయనం' పాత్రలో నట విశ్వరూపం ప్రదర్శించాడు.

 విజయ్ పాత్రపై సర్వత్ర ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా "ఉప్పెన " సినిమాపై అల్లు అర్జున్ స్పంధించాడు. ఇటీవల "ఉప్పెన " సినిమా చూశానని, సినిమా అద్భుతంగా ఉందని తెలిపాడు. తన ట్విటర్ ఖాతాలో బన్నీ స్పంధిస్తూ.." ఉప్పెన సినిమాకు విజయ్ సేతుపతి నటన ప్రాణం పోసింది. తన అద్బుతమైన నటనతో సినిమాను విజయ్ మరో స్థాయికి తెసుకెళ్ళాడు" అని అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సనా టేకింగ్ అద్భుతం. డిఓపి మరియు ఇతర సాంకేతిక బృందం యొక్క పని కూడా చాలా గొప్పగా ఉందని, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అధనపు బలంగా నిలిచిందని" అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: