‘సాహో’ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోవడంతో  ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ‘రాథే శ్యామ్' పై ఉంది. సుమారు దశాబ్దం తరువాత ప్రభాస్ లవర్ బాయ్ ఇమేజ్ లో ఈ మూవీలో నటిస్తున్నాడు. యూరప్ నేపధ్యంలో నడిచే ఈ మూవీ ప్రేమ కథ 1980 కాలాన్ని గుర్తుకు చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు లీక్ అయింది.


ఈ మూవీలో నాలుగు పాటలు ఒక్క ఫైట్ మాత్రమే ఉంటుందట. ప్రభాస్ సినిమా అంటే మాస్ ప్రేక్షకులు భారీ ఫైట్స్ ను కోరుకుంటారు. అలాంటి పరిస్థితులలో ఈ మూవీలో కేవలం ఒక్క ఫైట్ మాత్రమే ఉంటుంది అని వస్తున్న లీకులను చూసి ప్రభాస్ అభిమానులు హడలి పోతున్నారు. ‘సాహో’ మూవీలో ఫైట్స్ తప్ప కథ లేదు అన్న కారణంతో ఆమూవీ ఫెయిల్ అయితే ‘రాథే శ్యామ్’ మూవీలో ఫైట్ కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది అని వస్తున్న వార్తలను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


దీనికితోడు ఈ మూవీలో కేవలం నాలుగు మాత్రమే పాటలు ఉంటాయి అని వస్తున్న వార్తలు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు అని టాక్. టాప్ హీరోల సినిమాలు అంటే కనీసం 5 పాటలు లేకపోతే ప్రేక్షకులు అంగీకరించరు. అలాంటిది ఒక లవ్ స్టోరీ మూవీలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఏమిటి అంటూ అభిమానులు ఖంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్ లో ప్రభాస్ లుక్ పై బాలీవుడ్ మీడియా విమర్శలు చేస్తున్న విషయం అభిమానుల దృష్టి వరకు వచ్చి వారు టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఈమూవీలో కేవలం 4 పాటలు ఒక ఫైట్ అన్న వార్తలువిని అభిమానులు దర్శకుడు జిల్ రాథా కృష్ణ ప్రభాస్ పై చేస్తున్న ప్రయోగం వికటిస్తుందా అన్న భయంతో ఈ మూవీ విడుదల అవుతున్న జూలై 30 డేట్ గురించి రోజులు లెక్కపెడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: