తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో మెప్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎన్నాళ్లగానో తండ్రితో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్న రామ్ చరణ్ ఈ సినిమాతో తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. ఫ్యాన్స్ కోరికతో పాటు తనకు తన తండ్రితో నటించాలనీ ఉందని గతంలో చాలా సార్లు చెప్పిన చెర్రీ ఈ విధంగా తన కోరికను ఆచార్య రూపంలో తీర్చుకున్నాడు.

ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండా.. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్‌లు నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక చిరంజీవ సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. రామ్ చరణ్సినిమా సిద్ధా పాత్రలో ఓ నక్సలైట్‌గా కనిపించనున్నాడని టాక్. ఇక మరోవైపు చిరంజీవి ఈ సినిమాలో డబుల్ రోల్స్‌లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. దీనికి సంబందించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం.



అయితే ఆచార్య మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సోనూ సూద్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సోనూసుద్ ‌తో పాటు మరో నటుడు కూడా విలన్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. భీష్మ, అశ్వథ్థామ వంటి సినిమాల్లో విలన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి తెలుగులో చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

ఇక జిష్షు సేన్ నాగశౌర్య ‘అశ్వథ్థామ’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాల్లో నటించనున్నాడు. రెండు రీమేక్‌లే కావడం విశేషం. మలయాళంలో మోహన్ లాన్ నటించిన లూసిఫర్‌ను ఆయన తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాకు మోహన రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇక మరోవైపు తమిళ్‌లో అజీత్ హీరోగా వచ్చిన వేదాళంను కూడా చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: