‘క్రాక్’ ‘ఉప్పెన’ ‘నాంది’ కలక్షన్స్ చూసిన తరువాత ప్రేక్షకులు ధియేటర్లకు బాగా వస్తున్నారు అనుకున్న అంచనాలను తారుమారు అయ్యాయి. గతవారం విడుదలైన ‘చెక్’ మూవీ ఫ్లాప్ కావడంతో ఈవారం విడుదలైన 10 చిన్న సినిమాలలో ఏదో ఒక చిన్న సినిమా హిట్ అవుతుందని భావించారు.


సందీప్ కిషన్ సినిమా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’తో పాటు రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ తో పాటు దిల్ రాజ్ ‘షాదీ ముబారక్’ తారకరత్న చిత్రం ‘దేవినేని’ దర్శకుడు సుకుమార్ స్నేహితుడు హరిప్రసాద్ జక్కా నిర్మించిన ‘ప్లే బ్యాక్’ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ‘క్లైమాక్స్’ అందరూ కొత్త వాళ్లు నటించిన ‘ఎ’ మూవీలతో పాటు విజయ్ సేతుపతి యశ్‌ ల డబ్బింగ్ చిత్రాలు ‘విక్రమార్కుడు’ ‘గజకేసరి’ సినిమాలు ఒకేసారి విడుదల అయినప్పటికీ ఆ సినిమాలలో ఏఒక్క సినిమాను ప్రేక్షకులు పట్టించుకోకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


ఇన్ని చిన్న సినిమాలలో సందీప్ కిషన్ నటించిన ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ కనీస విజయం సాధిస్తుందని భావిస్తే ఆమూవీకి రివ్యూలు అంతంతమాత్రంగానే వచ్చాయి. ఇక దిల్ రాజ్ ‘షాదీ ముబారక్’ మూవీకి రివ్యూలు కొంతవరకు బాగానే వచ్చినా ఆ మూవీకి చెప్పుకోతగ్గ స్థాయిలో కనీసపు కలక్షన్స్ కూడ లేవు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ధియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చిన తరువాత ఒక్క 'ఉప్పెన’ తప్ప ఈవారం విడుదలైన ఏ ఒక్క సినిమా నిలబడే అవకాశం కనిపించడం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిన్న 10 సినిమాలు విడుదలైనప్పటికీ హైదరాబాద్ విజయవాడలోని అనేక మల్టీ ప్లెక్స్ ధియేటర్లలో ప్రేక్షకులు లేక చాల షోలు క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో సరైన కథ కంటెంట్ లేకుండా దర్శక నిర్మాతలు ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తే ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చే రోజులు పూర్తిగా అయిపోయాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ వారం విడుదలైన చిన్న సినిమాల ఫలితం చూశాక వచ్చేవారం మహాశివరాత్రి కి విడుదల కాబోతున్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ బయ్యర్లు భయపడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: