సినిమాకు 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే ప్రభాస్ కు కష్టాలు ఉన్నాయి అంటే ఎవరు నమ్మరు. అయితే ప్రస్తుతం ప్రభాస్ ముంబాయిలో కష్టాలు పడుతున్నాడని ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్ లో కంటే ఎక్కువగా ముంబాయిలోనే ఉంటున్నాడు.


దీనికి కారణం ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ‘సలార్’ ‘ఆదిపురుష్’ ‘రాథే శ్యామ్’ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రారంభంకాబోతున్న మూవీ ఇలా ఈ నాలుగు సినిమాలు అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీలుగా నిర్మాణం జరుపుకుంటున్న పరిస్థితులలో ప్రభాస్ ప్రతినెలా సుమారు 25 రోజులు ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ల కోసం మిగతా పనుల కోసం ఎక్కువగా ముంబైలోనే ఉండవలసి వస్తోంది.


ప్రభాస్ ప్రస్తుతం ముంబాయిలోని ఒక స్టార్ హోటల్ లో ఒక లగ్జరీ సూట్ తీసుకుని ఉంటున్న పరిస్థుతులలో ప్రభాస్ హోటల్ బిల్స్ రోజుకు లక్షల రూపాయలలో ఉంటున్నాయని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ అనవసరపు ఖర్చులు తగ్గించుకుందామని ప్రభాస్ ముంబాయిలోని ఒక పోష్ ఏరియాలో ఒక మంచి విల్లాను కొనుక్కుందామని గత కొన్ని రోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రభాస్ కు నచ్చిన ఇల్లు దొరకడం లేదని ఆ పత్రిక తన కథనంలో పేర్కుంది.


దీనితో ప్రభాస్ తన ఇంటి వేటను కొనసాగించడానికి ముంబాయిలోని ఒక ప్రముఖ రియలెస్టేట్ బ్రోకర్ సహాయంతో ప్రభాస్ తన ఇంటి వేటను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాను కొనాలి అని అనుకుంటున్న విల్లాకు సంబంధించి ప్రభాస్ టార్గెట్ గా పెట్టుకున్న బడ్జెట్ కు ప్రస్తుతం ముంబాయిలోని విలాసవంతమైన విల్లాల రేట్స్ కు వ్యత్యాసం ఉండటంతోపాటు ప్రభాస్ కు నచ్చే వాస్తు తో అతడికి ఇల్లు దొరకడం కష్టంగా ఉంది అంటూ ఆ పత్రిక తన కథనంలో అనేక ఆసక్తికర విషయాలు ప్రచురించింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: