వెండి తెర మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. పవన్ ని చూస్తూ అలా ఉండిపోతారు. అటువంటి అమితానందం అభిమానులది, మరి పవన్ సినిమాలో ఆయన పాత్రలు కూడా అలాగే అలరిస్తూంటాయి. వాటికి ఏ మెరుగులూ దిద్దకపోయినా పవన్ పవర్ అలా మెరిసిపోతుంది.

అయితే డైరెక్టర్ క్రిష్ మాత్రం పవన్ ఫ్యాన్స్ ని థియేటర్లలో మామూలుగా ఉంచాలనుకొవడంలేదు. తాను తీస్తున్న పీరియాడికల్ మూవీలో కూడా పవన్ ఫ్యాన్స్ కి నచ్చే సీన్లు అన్నీ ఏర్చి కూర్చి మంచి ఫుల్ మీల్స్ నే రెడీ చేసి పెడుతున్నాడుట. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ గా హరిహర వీర మల్లు అని పేరు పెట్టారు. శరవేగంగా జరుగుతున్న ఈ మూవీలో పవన్ పాత్ర చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నారని టాక్. ఇక ఈ మూవీలో విలన్ల మీద పవన్ చెప్పే డైలాగులు కానీ ఆయన వీరోచిత నటన కానీ ఫ్యాన్స్ ని ఎక్కడా కుర్చీల్లో కూర్చోనీయవు  అని అంటున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్  విలన్లను ఉద్దేశించి భారీ డైలాగులు చెప్పడమే కాదు, తొడగొట్టి సవాల్ చేసే సీన్లు కూడా ఉంటాయట.

పవన్ తొడ కొడితే ఆ సౌండ్ ఎలా ఉంటుంది అన్నది అంచనాలు వేయడం కూడా కష్టమే. పవన్ తన మూవీస్ లో ఇప్పటిదాకా తొడకొట్టే సీన్లు ఏవీ చేయలేదు. ముఖ్యంగా  నందమూరి హీరోలే ఆయా సీన్లు చేసి ఫ్యాన్స్ మెప్పు పొందారు. ఇపుడు పవన్ చేత తొడకొట్టించి మరీ చాలెంజ్ చేసే సీన్లను క్రిష్ తీయబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారుట. చాలా తొందరలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేస్తారని, అందులోనే తొడగొట్టే సీన్ కి కూడా చూపిస్తారని అంటున్నారు. అలాగే ఈ మూవీ టైటిల్ ని కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేస్తారని టాక్. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: