మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చరణ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా...రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుండి చరణ్ టీజర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక రామ్ చరణ్ నటిస్తున్న మరో సినిమా ఆచార్య ఈ చిత్రంలో మెగాస్టార్ హీరోగా నటిస్తుండగా...రామ్ చరణ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు ముప్పై నిమిషాలపాటు చరణ్ తండ్రి తో కలిసి స్క్రీన్ ను పంచుకోబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలే చరణ్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాల తరవాత చరణ్ ఎవరి డైరెక్షన్ లో నటిస్తాడో అని అంతా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కు చరణ్ అదిరిపోయే న్యూస్ చెప్పారు.

తన నెక్స్ట్ సినిమా ప్రముఖ దర్శకుడు శంకర్ తో ఉండబోతుందని స్పష్టం చేశాడు. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా లో చరణ్ కు జోడిగా దక్షిణ కొరియా హీరోయిన్ సుజీ నటించబోతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దాంతో సుజీ ఎవరా అని చరన్ అభిమానులు తెగ వెతికేస్తున్నారు. 2009 లో సుజి సూపర్ స్టార్ కే అనే ఓ టెలివిజన్ షో లో టాలెంట్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఆ తరవాత తక్కువ కాలంలోనే సూపర్ స్టారిని గా ఎదిగింది. సౌత్ కొరియన్ గర్ల్ మ్యూజిక్ గ్రూప్ లో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2011 లో డ్రీమ్ హై అనే టెలివిజన్ షో ద్వారా నటిగా పరిచయం అయ్యింది. 2012 లో రొమాన్స్ ఫిల్మ్ ఆర్కిటెక్చర్ 104 తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరవాత అనేక అవార్డులు సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మను అంతా నడిచే ఫ్యాషన్ హౌస్ అని పిలుచుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: