డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమా అందరికీ గుర్తుంది కదా.. ఆ సినిమాలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కళాత్రభవన్ మణి.. సినిమాలో రకరకాల వేషాలు, మిమిక్రీలు చేసి తెలుగు ప్రజలకు గుర్తుండి పోయారు. ఆ తరువాత కూడా కొన్ని తెలుగు సినిమాలలో నటించినప్పటికీ జెమిని సినిమాకి వచ్చినంత పేరు రాలేదు. కళాత్రభవన్ మణి మరణించి నేటికి 5 సంవత్సరాలు గడుస్తోంది. మార్చి 6 2016లో సాయంత్రం ఉపరితిత్తుల సమస్యతో కేరళలోని కోచిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు.మళయాళీ నటుడైన ఈయన ఆ భాషలో దాదాపు 200 సినిమాలలో నటించారు.

 అతనికి భార్య, కూతురు ఉన్నారు. 2000లో స్పెషల్ జ్యూరీ నేషనల్ ఫిల్మ్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును సాధించారు.ఇక తెలుగులో ఆయనకు గుర్తింపునిచ్చిన సినిమా జెమిని. హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించిన మణి ఆ తర్వాత విలన్ పాత్రల్లో నటించాడు. 2007 చిత్రం ‘చోట్టా ముంబై’ లో, కళభవన్ మణి నటేషన్ అనే పోలీసుగా నటించారు. ఈ నటుడు ఎంతగానో ఆకట్టుకున్నాడు,ఇక మలయాళంతోపాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా మంచి ప్రదర్శన కనబరిచారు. జానపద పాటలతో అభిమానులను ఆకర్షించారు.

అక్షరం సినిమాలో ఆటో డ్రైవర్ పాత్రలో మొదటి సారి వెండితెరకు పరిచయమయ్యాడు.ఆ తర్వాత సల్లపం చిత్రంలో మణి రాజప్పన్ పాత్రలో కరుమడికుట్టన్, వసంతి, లక్ష్మీ అండ్ మి వంటి సినిమాల్లో నటించాడు. మార్చి 5న 2016 కళాభవన్ మణి తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని ఎర్నాకుళంలోని ఆసుపత్రికి తరలించగా… మరుసటి రోజు సాయంత్రం ఆయన మరణించారు. చనిపోయేనాటికి మణి వయసు 45 సంవత్సరాలు..ఏదేమైనా ఇలాంటి మంచి నటులు ఇలా చిన్న వయసులోనే మరణించడం అనేది ఒకింత బాధాకరం అనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: