మొన్న మార్చి 5న ఒకేరోజు 9 సినిమాలు విడుదలయ్యాయి.అందులో మనకు బాగా తెలిసిన సినిమాలు సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ప్రెస్ , దిల్ రాజు షాది ముబారక్ , రాజ్ తరుణ్ పవర్ ప్లే అందులో ప్రస్తుతం బయట టాక్ ని చూస్తుంటే సందీప్ కిషన్ హిట్ కొట్టినట్టే ఉన్నారు. రివ్యూస్ కూడా అన్ని సందీప్ కిషన్ కి అనుకూలంగానే వస్తున్నాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత సందీప్ కిషన్ కి ఒక మంచి హిట్ వచ్చింది అని సోషల్ మీడియా లో అనుకుంటున్నారు.ఈ సినిమాకి కూడా అన్నిటికి మించి కలెక్షన్స్ వచ్చాయి.దాదాపు 5 కోట్ల బిసినెస్ చేసిన ఈ సినిమా ఒక్కటే ఈ 9 సినిమాల్లో ప్రాఫిట్స్ వచ్చేవి అని టాక్. ఇక దిల్ రాజు షాది ముబారక్  ఈ చిన్న సినిమాకు టాక్ బాగానే ఉంది కానీ కలెక్షన్స్ లేవు. చాలా చిన్న సినిమాగా వచ్చిన మరో మూవీ 'ప్లే బ్యాక్'. టీజర్, ట్రైలర్ తోనే వైవిధ్యమైన సినిమా అనిపించుకుందీ ప్లే బ్యాక్. ఇండియాలో ఈ తరహా కథనంతో వచ్చిన సినిమాలు లేవనే చెప్పాలి. కానీ కలెక్షన్స్ మాత్రం అంతగా లేవు అని చెప్పాలి.ఇక మిగతా సినిమాలకి అసలు మినిమమ్ కలెక్షన్స్ కూడా లేవు అని చెప్పాలి. ఇన్ని సినిమాలు విడుదలవ్వడం తో థియేటర్స్ సరిపోలేదు.దానితో ఏ సినిమాకి అంత రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. ఇంకొన్ని చోట్ల కొన్ని సినిమాలని మొదటి రోజునే కొన్ని సినిమాలని తీసేసారు. అయితే వచ్చే వారం జాతిరత్నాలు , శ్రీకారం లాంటి సినిమాలు ఉండటంతో ఈ చిన్న సినిమాలు అన్ని ఇలా ఒకేసారి వచ్చాయి ఆ ఈ ట్రేడ్ మాట్లాడుకుంటుంది. ఇక ఇన్ని సినిమాలు విడుదల కాకపోయే ఉంటే సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ప్రెస్ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది అని టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: