టాలీవుడ్ బడా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు భవిష్యత్తులో తన బ్యానర్ పై విడుదల చేయబోయే చిన్న సినిమాల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది. దిల్ రాజు అలా చేయకపోతే మాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా మినిమమ్ ఓపెనింగ్స్ లేక ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి.ఇక అసలు విషయంలోకి వెళదాం చూడండి...ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు హిట్లు కావడం గమనార్హం. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సినిమాలను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆసక్తి చూపేవారు.అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజు సినిమాలను సరిగ్గా జడ్జ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. దిల్ రాజు సోలో నిర్మాతగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఎఫ్ 2 మినహా మరే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు.


అయితే షాదీ ముబారక్ మూవీ విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ మరోసారి తప్పిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు ఆయన బ్యానర్ ను యాడ్ చేయడంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.నిన్న విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అయితే సినిమా పరవాలేదనిపించుకునేలా ఉన్నా సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా రావడం లేదని తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకు పబ్లిసిటీ బాగా చేసి ఉంటే మాత్రం సినిమా ఫలితం మరోలా ఉండేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


నిన్న విడుదలైన ఏ1 ఎక్స్ ప్రెస్ కలెక్షన్లపరంగా పరవాలేదనిపిస్తే షాదీ ముబారక్ మాత్రం డీలా పడినట్టు తెలుస్తోంది.దీనికి పూర్తిగా కారణం దిల్ రాజు ప్రమోషన్స్ సరిగ్గా చేసుండకపోవడమే. ప్రమోషన్స్ బాగా చేసుంటే ఖచ్చితంగా ఆ సినిమా పెద్ద హిట్ అయ్యుండేది. దిల్ రాజుకి మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చుండేది. ఇక ఇప్పటికైనా దిల్ రాజు కళ్ళు తెరిచి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: