రామ్ గోపాల్ వర్మ ఇండియా వైడ్ గా ఉన్న సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న ఆర్జీవి.. ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ప్రస్తుతం తాను తీసే సినిమాలలో కథల కన్నా పబ్లిసిటీ పైనే అధికంగా ఆధారపడుతున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం బూతు సినిమాలతోను, ఫ్యాక్షన్ సినిమాలతోనూ, మాఫియా సినిమాలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ ఇలా రకరకలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఈయన తీసిన ఈ సినిమా కూడా సక్సస్ బాటా పట్టడం లేదు. ఇదిలా ఉంచితే ఆర్జీవి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటాడనే సంగతి తెలిసిందే.

 అయితే ఎలాంటి సంఘటనల పైననైనా ఆర్జీవి తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇటీవలే హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిపై కూడా తనదైన స్టయిల్‌లో పంచులేశాడు. హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఇటీవలె ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌చేసింది. అందులో తన కుక్కకి కుడిచేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది. దీనిపై స్పందించిన వర్మ..'నిస్వార్థ ప్రేమకు ఇది నిదర్శనం. తన కుక్కకు కుడి చేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది. ఆమెకు కుక్కపై ఉన్న ప్రేమ ఎంతో  ఉన్నతంగా అనిపిస్తుంది. తక్షణమే ఆమెను  అంతర్జాతీయ కుక్కల మేయర్‌గా ఎంపిక చేయాలి. అంటూ సెటైర్లు వేశాడు.

 అయితే ఆర్జీవి పెట్టిన ఈ పోస్ట్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్జీవి ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే తాజాగా ఆర్జీవి పెట్టిన మరో పోస్ట్ కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ఉమెన్స్ డే సందర్బంగా ఆర్జీవి ట్వీట్ చేస్తూ " మహిళలు ప్రతి రోజు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను..అందుకే నేను వారికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కోరుకొను "అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆర్జీవి గతంలో ఉమెన్స్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ ఆర్జీవి పై సెటైర్లు కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: