తెలుగు సినిమా పరిశ్రమకు మనసు మమత అనే మూవీ ద్వారా తొలిసారిగా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు తరుణ్. తల్లిదండ్రులైన రోజా రమణి, చక్రపాణి ల ఆశీస్సులతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తరుణ్, చిన్నవయసు లోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అలానే ఆ వయసులో మణిరత్నం తీసిన అంజలి మూవీలో తన ద్వారా అందరినీ అలరించిన తరుణ్ కు ఏకంగా జతీయ అవార్డు కూడా లభించడం విశేషం. ఆపై బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు పలు ఇతర అవార్డులు కూడా గెలుచుకున్న తరుణ్, తొలిసారిగా హీరోగా పరిచయమైన సినిమా నువ్వే కావాలి.

రిచా హీరోయిన్ గా మంచి లవ్ కం ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామోజీ రావు నిర్మించగా కె. విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుని హీరోగా తొలి సినిమాతోనే తరుణ్ కి ఎంతో మంచి పేరు లభించింది. ఆ సినిమా తరువాత తరుణ్ కు అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన తరుణ్ కు మధ్యలో వచ్చిన ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, ఎలా చెప్పను, నవ వసంతం, శశిరేఖా పరిణయం, భలే దొంగలు వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అయితే ఆ తరువాత చాలావరకు ఆశించిన రేంజ్ సక్సెస్ ని అందుకోలేక కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్లో పడ్డ తరుణ్ ఇటీవల కొన్నాళ్లుగా ఎంతో సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన పలు బిజినెస్ లు కూడా చూసుకుంటున్నారని, అయితే మధ్యలో మంచి కథలు తన వద్దకు వస్తే మాత్రం వాటిని వదులుకోకుండా సినిమాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు చేరుకున్నప్పటికీ కూడా తరుణ్ కి యువత తో పాటు అమ్మాయిల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల 2018లో ఇది నా లవ్ స్టోరీ మూవీ ద్వారా తరుణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందుతున్న సమాచారాన్ని బట్టి త్వరలో తరుణ్ ఒక ఇంటివాడు కాబోతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఆయన ఇదివరకు మాదిరిగానే సినిమాలు వరుసగా చేస్తే బాగుంటుందని, తప్పకుండ రాబోయే రోజుల్లో ఆయనకు కెరీర్ పరంగా మంచి బ్రేక్ లభించాలని ఆయన అభిమానులు కోరుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: