టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ శంకర్ దాదా ఎంబిబిఎస్. కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతకముందు బాలీవుడ్ లో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కింది. ఇక శంకర్ దాదా ఎంబిబిఎస్ లో శంకర్ గా మెగాస్టార్ అత్యద్భుత నటనకు ఆడియన్స్ ను నుండి విపరీతమైన పేరు లభించింది. ఇక ఆ సినిమాలో కేవలం కొన్ని నిముషాల నిడివి గల ఒక చిన్న పిల్లాడి పాత్రలో నటించారు పంజా వైష్ణవ్ తేజ్.

ఒక వింత వ్యాధితో బాధపడుతూ పూర్తిగా వీల్ చైర్ కె పరిమితం అయిన పిల్లాడిగా నటించిన వైష్ణవ్ తేజ్ స్వయానా మెగాస్టార్ సోదరి కుమారుడు అనే విషయం తెలిసిందే. యువ నటుడు సాయిధరమ్ తేజ్ కు సోదరుడైన వైష్ణవ్ తేజ్, ఇటీవల తొలిసారిగా హీరోగా ఉప్పెన సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్ చేయగా సీనియర్ నటుడు సాయి చంద్, వైష్ణవ్ కి తండ్రి పాత్రలో కనిపించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

గత నెలలో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి తొలి సినిమా తోనే హీరోగా వైష్ణవ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. హృద్యమైన ప్రేమకథగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని ఎంతో బాగా తీశారు. ఇక ఈ సినిమా నిన్నటితో ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ని అందుకుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా అనుకోకుండా శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీ లో చిన్న పాత్ర లో తళుక్కుమన్న వైష్ణవ్ తేజ్, తొలి సినిమా ఉప్పెన ద్వారా భారీ సక్సెస్ అందుకుని రూ.100 కోట్ల హీరో అయ్యారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: