లేటెస్ట్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి తీస్తున్న భారీ మూవీ ఆర్ఆర్ఆర్. తొలిసారిగా మెగా నందమూరి హీరోలు ఇద్దరూ కూడా కలిసి నటిస్తుండడంతో పాటు ఇటీవల బాహుబలి సినిమాలతో అతి పెద్ద విజయాలను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి తీస్తున్న తదుపరి సినిమా కావడంతో దీనిపై అందరిలోనూ ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి అనే చెప్పాలి. మరోవైపు ఈ మూవీ పై మన దేశంలోనే కాదు పలు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియ శరన్, అజయ్ దేవగన్ తదితరులు ఇతర ముఖ్య పత్రాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా అనూహ్య స్పందన దక్కించుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది.

ఈ ఏడాది అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరిస్తోంది యూనిట్. అయితే రేపు రిలీజ్ తరువాత ఈ మూవీ భారీ రికార్డ్స్ ని సొంతం చేసుకోవడంతో పాటు కథ, కథనాల పరంగా ఆడియన్స్ మనసు తాకుతుందని, ఆ విధంగా పలు యాక్షన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలను కూడా ఎంతో అద్భుతంగా రాజమౌళి తీయడం జరిగిందని అంటున్నారు. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ మూవీ అటు కలెక్షన్స్ పరంగా అదరగొట్టడమే కాక ఇటు ఆడియన్స్ నుండి మంచి రివార్డ్స్ ని కూడా అందుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే...!!  

మరింత సమాచారం తెలుసుకోండి: