జూనియర్ చరణ్ లకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారి సినిమాలు విడుదలైతే చాలు ఆ మూవీల ఫలితం గురించి జూనియర్ చరణ్ ల కంటే ఎక్కువగా టెన్షన్ పడుతూ ఆమూవీ సాధించబోయే కలక్షన్స్ రికార్డుల గురించి అనేక లెక్కలు వేస్తూ ఉంటారు. అలాంటి జూనియర్ చరణ్ లు కలిసి నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న స్పాట్ నుండి ఒక షాకింగ్ న్యూస్ లీక్ అయింది.


ప్రస్తుతం జక్కన్న ఈమూవీ క్లైమాక్స్ ను ఒక తపస్సు లా చిత్రీకరిస్తున్నాడు. రాజమౌళి సినిమాలు అంటే ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే క్లైమాక్స్ ఫైట్స్ ఉంటాయి. హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉండే ఆ ఫైట్స్ కోసమే ప్రేక్షకులు రాజమౌళి సినిమాను ఒకటికి రెండు సార్లు చూస్తూ ఉంటారు. స్వాతంత్రోద్యమ నేపధ్యంలో ఒక ఊహాతీతమైన కథతో అల్లబడ్డ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ జూనియర్ లు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే.


ఈమూవీ క్లైమాక్స్ ఫైట్ పతాక స్థాయికి చేరుకునే సమయానికి బ్రిటీషర్స్ చరణ్ కు కళ్ళు జూనియర్ కాళ్ళ కు ఇద్దరికీ అవయవ లోపం కలిగే విధంగా కౄరంగా హింసిస్తారట. అయితే ఈ హింసకు చరణ్ జూనియర్ లు ఏమాత్రం లొంగిపోకుండా మరింత రెచ్చిపోయి కళ్ళు కోల్పోయిన చరణ్ నడవలేని జూనియర్ ను ఆసరాగా తీసుకుని బ్రిటీషర్స్ ను ఊచకొత్త కోస్తారట. ఈ ఫైట్ ఈమూవీకి హైలెట్ అని అంటున్నారు.


అయితే ఈ క్లైమాక్స్ ను ట్రాజిక్ క్లైమాక్స్ లా సగటు ప్రేక్షకుడు ఫీల్ కాకుండా ఈమూవీ చూస్తున్న ప్రేక్షకులకు ఎమోషన్ తో పాటు దేశభక్తి కలిగే విధంగా చిత్రీకరించారు అని టాక్. వాస్తవానికి ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఆరు నెలలకు పైగా సమయం ఉండగా ఈ క్లైమాక్స్ కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు బయటకు లీక్ కావడంతో ఇలాంటి క్లైమాక్స్ కు ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేయడంకోసమే ఈ క్లైమాక్స్ గురించి ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ లీకులు ఇస్తోంది అన్న సందేహాలు కూడ కలుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: