కలువ కళ్ల భామ ప్రణీత సుభాష్ భావ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు ముందే ప్రణీత తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన మహేష్ బాబు సినిమా పోకిరి కన్నడ రీమేక్ నటించి అలరించింది. ఇక తెలుగులో బావ సినిమా తో పాటు "ఏం పిల్లో ఏం పిలడో, రభస, డైనమైట్, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద" లాంటి సినిమాలతో అలరించింది. తెలుగు కన్నడ సినిమాలే కాకుండా హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు  చేసి ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.  పెద్ద పెద్ద కళ్ళతో పాలలాంటి చర్మం తో భువి నుండి దిగి వచ్చిన దేవ కన్యలా కనిపించే ప్రణీత.. కేవలం అందం అభినయం లోనే కాకుండా తన  అందమైన మనస్సుతో అందరి హృదయాల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా ప్రణీత లాక్ డౌన్ వేళ ఆకలితో అలాంటిస్తున్నవారికి భోజనాలు ఏర్పాటు చేసి వారి కడుపు నింపింది. రోజూ కూలీ చేసి జీవనం గడిపే 50 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున మొత్తం అలా లక్ష రూపాయలు ఇచ్చి వారికి అండగా నిలిచింది. అంతే కాకుండా 21 రోజుల్లో ప్రణీత 75 మందికి భోజనాలు పెట్టి వారి ఆకలి తీర్చింది.

లాక్ డౌన్ సమయంలో హెల్ప్ ది హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో పది లక్షల రూపాయలను విరాళంగా సేకరించి 450 కుటుంబాలను ఆదుకుంది. ఇక ప్రణీత కు ఇలా సహాయం చేసే గుణం తన తల్లి తండ్రుల వద్ద నుండే వచ్చింది. ప్రణీత తల్లి తండ్రులు బెంగుళూరు లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నడుపుతున్నారు. ఆ ఆస్పత్రి ద్వారా స్థోమత లేని వారికి ఉచితంగా వైద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక సినిమాల్లో సక్సెస్ అయ్యాక ప్రణీత తన తల్లి తండ్రులతో కలిసి "ప్రణీత ఫౌండేషన్" అనే స్వచ్చంధ సంస్థను ప్రారంభించారు. ఈ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ స్వరా బెంగుళూరులో "సేవ్ గౌర్నమెంట్ స్కూల్స్" అనే ఉద్యమంలో ప్రణీత భాగస్వామిగా ఉన్నారు. అంతే కాకుండా విటార్ అనే హెల్త్ హెల్త్ టెక్ స్టార్టప్ తో పేదలకు ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తున్నారు. వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా వారి ఆరోగ్య సమస్యల నివారణకు కూడా కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: