తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు ఎవరైనా ఉన్నారా..? అంటే అది కేవలం రాజేంద్రప్రసాద్  అని అంటారు చాలామంది.  అయితే కేవలం రాజేంద్ర ప్రసాద్ నటుడు మాత్రమే కాదు నిర్మాత, సంగీత దర్శకుడు కూడా. చాలా సినిమాలలో హాస్య చిత్రాలతో కథానాయకుడిగా నటించి,  మంచి హాస్య నటుడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఈయన నటించిన అహ నా పెళ్ళంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు,ఏప్రిల్ 1 విడుదల,మాయలోడు వంటి సినిమాలు రాజేంద్రప్రసాద్ కు మంచి నటుడిగా, హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాయి.


రాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడ దగ్గర దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అయితే తాను బాల్యంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. అలా చిన్నప్పటినుండి ఎన్టీఆర్ ప్రభావం రాజేంద్రప్రసాద్ పై పడింది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించక ముందు తను సిరామిక్ ఇంజినీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశాడు..


ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ కి ఉన్న ఆసక్తిని గమనించి, ఎన్టీఆర్ చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రాజేంద్ర ప్రసాద్ ను  చేర్పించాడు. ఇక నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలి చిత్రం బాపు దర్శకత్వంలో" స్నేహం"  అనే సినిమా.  ఇది 1977 సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైంది. ఆ తరువాత స్రవంతి మూవీస్ బ్యానర్ పై లేడీస్ టైలర్ సినిమా రాజేంద్రప్రసాద్ కు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిపెట్టింది..


నిజానికి స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ట్ అయిన మొట్టమొదటి చిత్రం రాజేంద్ర ప్రసాద్ నటించిన లేడీస్ టైలర్.. ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన " గాలి సంపత్"   ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. " నన్ను నటుడిగా జీవితంలో నిలబెట్టిన మొదటి సినిమా లేడీస్ టైలర్. అదికూడా స్రవంతి మూవీస్ బ్యానర్ పై విడుదలైంది.. ఒకవేళ ఆ సినిమా లేకుంటే నేను ఇవాళ ఇక్కడ లేను.. అలాగే గాలి సంపత్ నా జీవితంలో ఒక ఆణిముత్యం" లాంటిది అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇటీవల గాలి సంపత్ సినిమా కూడా స్రవంతి మూవీస్ బ్యానర్ పై మార్చి 11న విడుదల కాబోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: