ఆయన టాలీవుడ్ లోని గొప్ప నటులలో ఒకరు. ఆయనను నట శిఖరంగా కూడా చెప్పుకోవాలి. ఆయన ముందు నాటక రంగం నుంచి వచ్చారు. అక్కడ ఆయన నటనకు ప్రత్యక్షంగా జనం జేజేలు పలికారు. ఆ తరువాత సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగించిన ఆయన  ఈ మధ్యన బాగా డల్ అయ్యారు. దానికి వయసు మీద పడిన ప్రభావమే ఒక కారణం.

అయితే ఎంత వయసు మీద పడినా కూడా ఆయనలోని నట పిపాస మాత్రం ఎక్కడా తగ్గలేదు. అందుకే తాను ఇంకా సినిమాలు చేస్తాను అంటున్నారు. ఆయన డైలాగులకు ఒకపుడు పెద్ద ఫ్యాన్స్ ఉండేవారు. ఇపుడు మాత్రం ఆయనకు నటన మీద అపేక్ష ఉన్నా గతంలోలా చురుకుదనం కనిపించడంలేదు. అయినా సరే తాను నటించాలి అన్న తపన ఆయనలో కనిపిస్తోంది. అందుకే ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫోన్లు చేసి మరీ తనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని కోరారట. ఈ మధ్యన ఒక మీడియా ఇంటర్వూలో ఆయన  ఈ విషయం చెబుతున్నపుడు విన్న ఫ్యాన్స్ మొదట షాక్ తిన్నారు. కానీ ఆ తరువాత ఆయన డబ్బుల కోసం కాదు, నటించడం అన్న ఆనందం కోసమే సినిమాల్లో చాన్సులు అడుగుతున్నారని విన్నపుడు మాత్రం చాలా గర్వంగా  ఫీల్ అయ్యారుట.

మొత్తానికి కోటా డైలాగ్ డెలివరీ అయినా ఆయన డిక్షన్ అయినా అన్ని తరాలకూ ఆదర్శం. ఇపుడు ఏడు పదులు దాటిన వయసులో ఆయన నటన పట్ల కనబరుస్తున్న ప్రేమాభిమానాలు కూడా నటులకు ఒక స్పూర్తి అని చెప్పాల్సిందే.ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో కోటా కనిపిస్తారు అంటున్నారు. మరిన్ని సినిమాల్లో ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి హ్యాపీయే కదా. ఏది ఏమైనా నటనకు ఆయన పెట్టని కోట సుమా.



మరింత సమాచారం తెలుసుకోండి: