తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి రాజకీయాల్లో చేరి, కేంద్రమంత్రి గా కూడా పనిచేసి, కళామతల్లి సేవలో తరించాలని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.వస్తూ వస్తూనే తమిళంలో హిట్టైన కత్తి రీమేక్ గా ' ఖైదీ నంబర్ 150' నటించి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. అయితే నేరుగా తెలుగు సినిమాల కంటే రీమేక్ సినిమాల్లో ఎక్కువగా మెగాస్టార్ నటిస్తున్నారు. నిజానికి ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా చాలా రీమేక్ మూవీస్ లో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

నిజానికి 1981లో తమిళంలో హిట్టైన సట్టం ఓరు ఇరుత్తరయ్ రీమేక్ 'చట్టానికి కళ్లు లేవు' సినిమాలో నటించి విజయం సొంతం చేసుకున్న చిరంజీవి, ఆతర్వాత కన్నడ రీమేక్ లో నటించాడు. కన్నడంలో హిట్టైన పట్టనెక్క బంద పత్నియరు సినిమా రీమేక్ గా 'పట్నం వచ్చిన పతివ్రతలు' మూవీలో మోహన్ బాబుతో కలిసి చిరంజీవి నటించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇక చిరు కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ రీమేక్ కానప్పటికీ ఫస్ట్ బ్లడ్ అనే ఆంగ్ల మూవీ ఆధారంగా తెరకెక్కింది. హిందీలో హిట్టైన సాహెబ్ సినిమాకు రీమేక్ గా 'విజేత' హిట్ అయింది.

అలాగే మలయాళంలో హిట్టైన పూనివా పుతికా సినిమాకు రీమేక్ గా 'పసివాడి ప్రాణం' మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. తమిళంలో హిట్టైన అమ్మన్ కొవిల్ కిజకాలె సినిమా రీమేక్ గా చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 786 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లో హిట్లైన ఘరానా మొగుడు, హిట్లర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీస్ కూడా రీమెక్ గా వచ్చినవే..ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మెగాస్టార్ నటిస్తున్న తరువాతి రెండు ప్రాజెక్ట్ లు కూడా రీమేక్ లే.. అందులో ఒకటి మలయాళ లూసిఫార్ రీమేక్.. మరొకటి తమిళంలో అజిత్ నటించిన వేదాలం రీమేక్..ఇక చిరూ నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..ఇక మే13 న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: