లారెన్స్.. నృత్య దర్శకుడిగా తన కెరీర్ ని మొదలుపెట్టిన లారెన్స్ ఇప్పుడు టాప్ డైరెక్టర్.. హారర్ సినిమాలకు లారెన్స్ కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. అయన చేసిన సినిమాల్లో హారర్ సినిమాలే ఎక్కువగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.. నాగార్జున మాస్ చిత్రంతో దర్శకుడిగా మారిన లారెన్స్ ఆ తర్వాత ఆ సినిమా హిట్ కొట్టి తొందర్లోనే దర్శకుడుగా మంచి ఫేమ్ అందిపుచ్చుకున్నారు. ఆ సినిమా హిట్ ఇచ్చిన జోష్ తో లారెన్స్ రెండో సినిమాని తానే హీరోగా స్టైల్ అంటూ చేశాడు.. అది కూడా సూపర్ హిట్ అయ్యింది..

ఆ తర్వాత ముని, డాన్, కాంచన సినిమాలు ఆయనకు మంచి దర్శకుడిగా పేరు తెచ్చాయి.. ఈ జోష్ లో ప్రభాస్ తో రెబల్ చేశాడు.. అయితే ఆ సినిమా ఇద్దరికీ దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. కాంచన 2,3 సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.. దీంతో లారెన్స్ తన తదుపరి సినిమా కి కొంత గ్యాప్ ఇచ్చాడు. అయితే తాజాగా అయన నటనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.. తాజాగా ఓ క్రేజీ సినిమాలో ఆయనకు విలన్ గా అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

మల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విక్రమ్’. కొన్నాళ్ల క్రితం సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా నెల రోజుల షెడ్యూల్ లో కొన్ని కీలకసన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత కమల్ రాజకీయాల కోసం విరామం తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ని బట్టి ఇదొక యాక్షన్ ఫిలిం అనే సంగతి తెలుస్తోంది. ఇందులో కమల్ కి ధీటుగా విలన్ రోల్ ఉంటుందని సమాచారం. దీనికి ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. లారెన్స్ కొన్నాళ్లుగా ఆయన డైరెక్ట్ చేస్తోన్న సినిమాల్లోనే నటిస్తున్నారు. ఆయన నటించిన ‘కాంచన’ సిరీస్ చూస్తే.. నెగెటివ్ టచ్ ఉన్న రోల్స్ కూడా బాగా చేయగలడనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: