సినిమా ఇండస్ట్రీ లో అనే కాదు సమాజంలో ఈరోజుల్లో ఇల్లీగల్ అఫైర్స్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఏం చూసి పరాయి వారితో సంబంధం కోసం చూస్తున్నారో కానీ ఈ తరహా సంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.. దీనివల్ల జరిగే అనర్ధాలను పట్టించుకోకుండా ప్రాణాలు పోతాయనే అవగాహనా ఉండి కూడా ఆడవారు మగవారు ఈ తరహా రిలేషన్ కి అలవాటుపడుతున్నారు. సామాన్యులే అనుకుంటే సెలబ్రిటీలు కూడా ఈ విధంగా చేయడంతో వారు ఈ సమాజానికి ఎంత చెడ్డ దారి చూపిస్తున్నారో వారికి అర్థం కావట్లేదు.  తాజగా భర్త ఉన్నా కూడా పరాయి మొగుడితో ఎఫైర్ కొనసాగిస్తోంది ఓ హీరోయిన్..

ఆమె ఎవరంటే హాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు చేసి పెద్ద పేరు దక్కించుకున్నకిమ్ కర్దాషియాన్..  హాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ దంపతులు కాన్యే వెస్ట్, కిమ్ కర్దాషియాన్ ఇటీవలే విడాకులకు దాఖాస్తు చేసుకోగా ఈ విషయం అందరిని షాక్ ఇచ్చింది. 2014లో వివాహం చేసుకొన్న దంపతులు దాదాపు ఆరేళ్లపాటు వైవాహిక జీవితాన్ని చక్కగా అనుభవించారు. అయితే 2020 ఆరంభం నుంచి వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు.

అయితే ఈ విడాకులకు కారణం కిమ్ కర్దాషియాన్ వేరొకరితో అక్రమ సంబంధం అని చర్చ జోరుగా సాగుతుంది. కెనడియన్ పాప్ స్టార్ డ్రేక్‌తో కిమ్ కర్దాషియన్ సంబంధం పెట్టుకొన్నట్టు వార్తలు వచ్చాయి. స్వయంగా ఇటీవల డ్రేక్‌ ఆ విషయాన్ని ప్రకటించడం సంచలనంగా మారింది.పాస్ట్ స్టార్ డ్రేక్ ఇటీవల తన వాంట్స్ అండ్ నీడ్స్ అనే వీడియో ఆల్బమ్‌ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తనకు కిమ్‌కు అఫైర్ ఉందని పరోక్షంగా వెల్లడించారు. అయితే కిమ్ పేరు ఎత్తకుండా తనకు ఆమెతో అఫైర్ ఉందని స్పష్టం చేశారు. దాంతో కాన్యే వెస్ట్‌తో విడిపోవడానికి అసలు కారణం ఇదే అంటూ హాలీవుడ్ పత్రికలు కథనాలు ప్రచురించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: