టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా ముందుకు రాబోతున్న సినిమా "శ్రీకారం". ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా "గ్యాంగ్ లీడర్" ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కింది.ఇక ఈ సినిమాని మార్చి 11న విడుదల శివరాత్రి కానుకగా విడుదల కాబోతుంది. ఇక '14 రీల్స్ ప్లస్‌' బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.మిక్కీ జే మేయర్ విడుదల చేసిన 'వస్తానంటివో' లిరికల్ సాంగ్ కు యూ ట్యూబ్ లో మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి.ఇక టీజర్ , ట్రైలర్లు కూడా పర్వాలేదు అనిపించాయి.దాంతో సినిమాకి మంచి బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు.


ఇక  ఈ 'శ్రీకారం' సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే ఈ సినిమాకి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి..ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే శర్వానంద్ గత చిత్రాలు 'పడి పడి లేచె మనసు' 'రణరంగం' 'జాను' చిత్రాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ఆ చిత్రాలు కనీసం రూ.10కోట్ల షేర్ ను నమోదు చేయలేకపోయాయి. ఇలాంటి టైంలో ఇంత రిస్క్ చెయ్యడం అవసరమా అనిపిస్తుంది.దాంతో 'శ్రీకారం' రూ.17కోట్ల వరకూ షేర్ ను రాబడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.పైగా ట్రైలర్ చూస్తే మహేష్ బాబు "మహర్షి" ని తలపించేలా వుంది. ఆల్రెడీ మహర్షి చూసిన ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారా అనే అనుమానం నెలకొంది.అయితే పాజిటివ్ టాక్ వస్తే.. అదేమీ పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి.చూడాలి మరి ఈ సినిమా హిట్ అయ్యి ఎంత వరకు పెట్టిన బిజినెస్ ని వసూలు చేస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: