నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల తన మేనమామ వెంకటేష్ తో కలిసి నటించిన వెంకీ మామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు. ఇక ఆ తరువాత కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ సమయంలో పలువురు దర్శకుల నుండి కథలు విన్న చైతన్య , ఇటీవల ఒకే సారి రెండు సినిమాలు లైన్లో పెట్టారు. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల తీస్తున్న లవ్ స్టోరీ కాగా మరొకటి విక్రమ్ కె కుమార్ తీస్తున్న థాంక్యూ మూవీ. అయితే వీటిలో లవ్ స్టోరీ మూవీని సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల కలిసి నిర్మిస్తుండగా సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీనితో పాటు తెరకెక్కుతున్న థాంక్యూ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాన సంఘం ప్రెసిడెంట్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గతంలో నటించిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమా థియేటర్ లో నాగ చైతన్య చేసిన హంగామా కు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఇటీవల హైదరాబాద్ లో తీసిన యూనిట్, ప్రస్తుతం మహేష్ నటించిన ఒక్కడు మూవీ రిలీజ్ సమయంలో చైతన్య సహా పలువురు ఇతర నటులు ఆ మూవీ రిలీజ్ సమయంలో చేసిన హడావుడి కి సంబదించిన సన్నివేశాలు రాజమండ్రి లోని అశోక థియేటర్ లో వేసిన ప్రత్యేక సెట్ లో తీస్తున్నారు. 

కాగా ఆ థియేటర్ చుట్టుప్రక్కల గల పలువురు ప్రజలు, మహేష్ ఫ్యాన్స్ ఆ షూటింగ్ ని కొంత తమ ఫోన్స్ లో షూట్ చేసి వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాకు తమ మహేష్ ఫ్యాన్స్ అందరి మద్దతు ఉంటుందని, తప్పకుండా మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటూ పలువురు మహేష్ ఫ్యాన్స్ దానిని సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ తో దాన్ని ట్రెండ్ గా సెట్ చేసి పరిగెత్తిస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: