సీనియర్ హీరో జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగపతి బాబుకి లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది.పూర్తిగా ఫ్యామిలీ మూవీస్ చేసిన జగపతి బాబు ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో విలన్ అవతారమెత్తాడు ఈ నటుడు. బోయపాటి రూపొందించిన 'లెజెండ్' సినిమాలో జగపతి బాబు ని విలన్ గా చూసిన వారంతా షాకయ్యారు. అంతగా తన నటనతో మెప్పించాడు. బాలకృష్ణ కి ధీటుగా లెజెండ్ లో ఆకట్టుకున్నాడు జగపతి బాబు.విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా జగ్గుభాయ్ దూసుకుపోయాడు.


ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడవ సినిమాలో జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి ఈ ముగ్గురు కలిసి పని చేస్తుండడంతో ఈసారి కూడా జగపతి బాబు..బాలయ్యని ఎదిరించే విలన్ గా కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో జగపతిబాబు క్యారెక్టర్ పాజిటివ్ గా ఉండబోతుందని సమాచారం. ఈ పాత్రని బోయపాటి స్పెషల్ గా రాసుకున్నాడట. సినిమాలో బాలయ్యకి కుడిభుజం లాంటి పాత్రలో జగపతి కనిపిస్తాడట.ఈ క్యారెక్టర్ ఒక రేంజిలో ఉండబోతుందని సమాచారం అందుతుంది. ఖచ్చితంగా మెప్పించడం ఖాయమట..ఆయన పాత్రే ఈ కథలో కీలకమైన మలుపుకి కారణం అవుతుందని తెలుస్తోంది. బోయపాటి సినిమాల్లో హీరోకి ఓ గ్యాంగ్ ఉంటుంది. అందులో అందరూ మంచివాళ్లే. ఈ సినిమాలో అలాంటి గ్యాంగ్ లో జగపతిబాబు ఉంటాడట. శ్రీకాంత్ ప్రధాన విలన్ అయినప్పటికీ.. సినిమాలో చాలా మంది విలన్లు కనిపిస్తారని తెలుస్తోంది.


అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారని సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వారి అంచనాలకి తగ్గట్లుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట బోయపాటి...

మరింత సమాచారం తెలుసుకోండి: