గతంలో దర్శకుడు అవ్వాలంటే ఒకరిద్దరు దర్శకుల దగ్గర పనిచేసి చాలా రోజుల పాటు కష్టపడితే కానీ దర్శకత్వ అవకాశాలు లభించేవి కావు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అసలు ఏ మాత్రం దర్శకత్వ అనుభవం లేకపోయినా సరే హీరోకి కథ చెప్పి ఒప్పించగలిగితే దర్శకత్వం ఛాన్స్ లు వచ్చేస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే గతంలో హీరోలు కూడా దర్శకుల బ్యాగ్రౌండ్ చూసి  అవకాశాలు ఇచ్చేవారు. ఇప్పుడు వీరు కూడా ట్రెండ్ మార్చారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి తే దర్శకుల బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా ప్లేబ్యాక్ అనే సినిమాతో హరిప్రసాద్ జక్కా అనే దర్శకుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన గతంలో సుకుమార్ వద్ద పని చేశారు. 

వన్ నేనొక్కడినే, 100% లవ్ వంటి సినిమాలకు ఆయన కథా సహకారం కూడా అందించాడని చెబుతూ ఉంటారు. ఇక ప్లే బ్యాక్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయనకు ఏకంగా మెగా కాంపౌండ్ లో హీరోని దర్శకత్వం వహించే అవకాశం దొరికిందని అంటున్నారు. వరుణ్ తేజ్ ఈ దర్శకుడి ని పిలిపించి తన కోసం ఏదైనా కథ సిద్ధం చేయమని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ దర్శకుడు గతంలో దర్శకుడు అనే సినిమా చేశాడు.

సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా ప్లేబ్యాక్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి వరుణ్ తేజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే ఒక సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ త్రీ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఆయన హరిప్రసాద్ తో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం అవుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: