ఆర్ ఎక్స్ 100తో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తో ఒక్కసారిగా స్టార్ డం తెచ్చుకున్నాడు కార్తికేయ.. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ సెన్సేషన్ గా నిలిచింది. కార్తికేయ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. ఈ సినిమా కు తాను తప్పా ఎవరు సూట్ అవ్వరు అన్న రేంజ్ లో చేశాడు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో కార్తికేయ కు పెద్ద సంస్థలు సినిమా ఆఫర్ చేశాయి..RX100 తరువాత హిప్పీ అనే సినిమా ట్రై చేసాడు. కానీ ఫలితం దక్కలేదు.

తమిళంలో పెద్ద సంస్థ ప్రొడ్యూస్ చేసిన  ఆ సినిమా దారుణమైన ఫలితాన్నిఇచ్చింది.ఇక ఆ  తర్వాత గుణ 369 , 90ML  అనే డిఫరెంట్ సినిమాలు ట్రై చేసినా వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు చావు కబురు చల్లగా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లావణ్య త్రిపాఠి కథానాయిక.. గీతా ఆర్ట్స్ సంస్థ 2 నిర్మిస్తున్న ఈ సినిమా ఈ 19 న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా టీజర్, ట్రయిలర్ ఇప్పటికే బయటకు వచ్చి మంచి స్పందన దక్కించుకున్నాయి.. ఇక సినిమాహీరో భర్త చనిపోయిన అమ్మాయిని, అది కూడా చావు ఇంట్లో చూసి ప్రేమిస్తాడు. ఆపై వెంటపడతాడు. ఇది కాస్త కొత్తగా వుంది అని అంతా అనుకుంటున్నరు. అయితే సినిమాలో ఇంతకు మించిన అన్ కన్వెన్షనల్ పాయింట్లు వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తొలిసారిగా ప్రేక్షకుల సెంటిమెంట్ ను కాకుండా, వైవిధ్యాన్ని ఆదరిస్తారనే ఆలోచనతో గీతా ఓ కొత్త తరహా కథను తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో కార్తికేయ పాత్రతో పాటు, హీరో తల్లి ఆమని పాత్ర కూడా కీలకంగా వుంటుందని తెలుస్తోంది.   ఇటీవలే ఉప్పెనలో ఓ షాకింగ్ పాయింట్ ను కథలో చేర్చారు. జనం చూసారు. చావు కబురు చల్లగాలో కూడా కొన్ని షాకింగ్ పాయింట్లు వున్నాయని తెలుస్తోంది. సినిమా కథలు ఇలాగే వుండాలి, పాత్రలు ఇలాగే ఆలోచించాలి అనే రోటీన్ థాట్ ప్రాసెస్ కు విభిన్నంగా ఈ కథ చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: