రియా చక్రవర్తి.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ లో ప్రధాన కారణం రియా చక్రవర్తి అని ముందునుంచి ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచయమైన రియా తూనీగ తూనీగ సినిమా తో ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్ద గా అవకాశాలు రాక బాలీవుడ్ కి చెక్కేసింది.అక్కడ కొన్ని హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.. అయితే ఈమధ్య ఆమె వివాదంలో చిక్కుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు..

 బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన రియా ఆ తర్వాత సుశాంత్ తో కొన్ని రోజులు ప్రేమాయణం కొనసాగించింది.. ఈ నేపథ్యంలో సుశాంత్ సూసైడ్ చేసుకోవడంలో ఈమె పాత్ర ఎంత ఉంది అని పోలీసులు ఆరా తీశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు సుశాంత్ మరణం కేసు లో డ్రగ్స్ కుంభకోణం బయటపడింది.. దేశంలో పలువురు సినీ తారలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకి కూడా వెళ్లారు..డ్రగ్స్ కారణంగానే సుశాంత్ ను రియా చక్రవర్తి ఆత్మహత్యకు ప్రేరేపించిందనే కోణంలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఎంతో మందిని విచారించి చాలా వివరాలు సేకరించి ఫైనల్ గా చార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో మొత్తం 12 వేల పేజీలతో కూడిన చార్జ్ షీట్ ను దాఖలు చేశారు అధికారులు. మొత్తం 32 మందిని నిందితులుగా పేర్కొన్న ఎన్సీబీ.. సుమారు 200 మంది సాక్షులుగా చూపించింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మాట్లాడిన అధికారులు.. కాల్ రికార్డులు వాట్సాప్ చాటింగ్ బ్యాంకు డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ సాగించినట్లు చెప్పారు. ఈ ఛార్జ్ షీట్ ఆధారంగానే తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. అయితే.. ఈ ఛార్జ్ షీట్ ను రియా చక్రవర్తి లాయర్ లైట్ తీసుకున్నారు. ఊహించనట్టే ఛార్జి షీట్ ఉందన్న లాయర్ సతీష్ మానేషిండే.. అదంతా ఓ వ్యంగ్య రచన అంటూ కొట్టిపారేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: